అసలైన ఘట్టంలో శర్వా 'భోగి'
లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ అప్డేట్ బయటకు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆఖరి షెడ్యూల్ ను ఇటీవల ప్రారంభించారు.
By: M Prashanth | 12 Jun 2026 11:21 PM ISTచార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. ఈ ఇద్దరికీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ సక్సెస్ అందుకోవడం చాలా అవసరంగా. శర్వానంద్ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నా లాంగ్ రన్ లో పెద్ద కమర్షియల్ హిట్ పడి చాలా కాలమైంది. అటు సంపత్ నంది కూడా తన పాత ఫార్ములాలను పక్కనపెట్టి ఈసారి సరికొత్త రా అండ్ రస్టిక్ జోనర్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ అప్డేట్ బయటకు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆఖరి షెడ్యూల్ ను ఇటీవల ప్రారంభించారు. ఒక భారీ స్పెషల్ సెట్ లో సినిమాకు కీలకమైన హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ తో సినిమా మేజర్ టాకీ పార్ట్ ముగియనుంది.
రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ గమనిస్తే ఈ వాతావరణం అంతా ఒక పీరియాడిక్ డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ లో కనిపిస్తోంది. ఆధ్యాత్మికతో కూడిన ఇంటెన్స్ ఎలిమెంట్స్ తో ఈ క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. సెట్ లో పెద్ద త్రిశూలాలు, ఎర్రటి తోరణాలు, కాళికా దేవి విగ్రహం లాంటివి కనిపిస్తుండటంతో కథలో ఏదో బలమైన రివెంజ్ డ్రామా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తాన్ని ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. శర్వానంద్ కెరీర్ లోనే ఇది అత్యంత ఊరమాస్ ఎపిసోడ్ గా నిలిచేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే కేవలం ఫైట్లు మాత్రమే ఉంటే సరిపోదు, వాటి వెనుక బలమైన ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వాలి. సంపత్ నంది ఈ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నట్లు ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.
ఈ పీరియాడిక్ డ్రామాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇస్తుండటంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంది. సినిమాను ఆగస్టు 28న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టిగానే కసరత్తులు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో శర్వానంద్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. రొటీన్ మాస్ సినిమాల వైపు వెళ్లకుండా కంటెంట్ ప్లస్ వయలెన్స్ ను నమ్ముకుని వస్తున్న ఈ 'శర్వా సంపత్ బ్లడ్ ఫెస్ట్' ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం క్లైమాక్స్ షెడ్యూల్ తో హడావుడి చేస్తున్న ఈ సినిమా మునుముందు ఎలాంటి అప్డేట్స్ తో వస్తుందో వేచి చూడాలి.
