Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. 1960ల నాటి ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కల్పిత గ్రామం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. ఫ్యూడల్ వ్యవస్థ, దోపిడీలు, వాటికి వ్యతిరేకంగా పోరాటం ప్రధానాంశాలుగా తెలుస్తోంది. ఇందులో శర్వా గంగ అనే రస్టిక్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. అనుపమ, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   15 Nov 2026 4:00 AM IST
శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?
X

యంగ్ హీరో శర్వానంద్ క‌థానాయ‌కుడిగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా`భోగి`. అయితే ఈ సినిమా క‌థేంట‌న్న‌ది ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. టైటిల్ ను బ‌ట్టి కొన్ని గెస్సింగ్స్ వ‌చ్చినా? అవి అంత ప్రామాణికంగా క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌థ‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఇది లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీలకే పరిమితం కాదు. ఇందులో శర్వానంద్ పూర్తిగా రస్టిక్ - వైలెంట్ మాస్ అవతార్‌లో క‌నిపించ‌నున్నారుట‌. ఈ ప్రాజెక్ట్ నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 1960ల నాటి సామాజిక పరిస్థితులు..సరిహద్దు ప్రాంతాలలోని ఉద్రిక్తతల నడుమ కథ సాగుతుంద‌ని స‌మాచారం.

కథా నేపథ్యం ప్రధానంగా 1960ల కాలం నాటి ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఓ కల్పిత గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ కాలంలో ప్రాంతాన్ని శాసించిన ఫ్యూడల్ వ్యవస్థ, దోపిడీలు, వాటికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల నేపథ్యంలో ఈ పీరియాడిక్ డ్రామాను సంపత్ నంది అత్యంత సహజంగా తెర‌కెక్కిస్తున్నారుట‌. సరిహద్దు ప్రాంతాలు కావడంతో రెండు రాష్ట్రాల సంస్కృతులు, ఆచారాలు కలగలిసిన వాతావరణంలో జరిగే సంఘర్షణలు సినిమాకు ప్రధాన బలం కానున్నాయి.

ఈ చిత్రంలో శర్వానంద్ గంగ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. ఆయన బాడీ లాంగ్వేజ్ గెటప్ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయట‌. ఇందులో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తుండగా వారి పాత్రలు కూడా కథను మలుపు తిప్పేలా ఉంటాయ‌ని స‌మాచారం. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు తగినట్లుగా సరికొత్త ఇంటెన్సిటీని తెచ్చిపెట్టింది. ఇప్ప‌టికే విడుదలైన ప్ర‌చార చిత్రాలుసినిమాలో రక్తపాతం, పోరాట పటిమను చాటి చెబుతున్నాయి.

యాక్ష‌న్ పాత్ర‌ల్లో సైతం శ‌ర్వానంద్ ఒదిగిపోతారు. ద‌ర్శ‌కుల న‌టుడిగా ప‌ని చేయ‌డం శ‌ర్వా స్పెషాల్టీ. అత‌డిని అంత ఎత్తుకు తీసుకెళ్లంది ఆ ల‌క్ష‌ణ‌మే అన‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే వ‌రుస విజ‌యాల‌తో ఉన్న హీరోని ఈ విజ‌యం మార్కెట్ ను రెట్టింపు చేయ‌నుంది. ద‌ర్శ‌కుడిగా సంపత్ నంది హిట్ అందుకుని చాలా కాల‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌యం అత‌డికి కీల‌క‌మైందే. ఇక రిలీజ్ విష‌యానికి వ‌స్తే సినిమా నవంబర్ లో విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ పరిశీలన వంటి కొన్ని ఊహించని పరిణామాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.