నారి నారి మధ్య కాదు.. ఆ సినిమా ఈ సినిమా మధ్య శర్వానంద్..!
ప్రస్తుతం అతను 3 సినిమాలు చేస్తున్నాడు. అందులో రెండు సినిమాలైతే మాత్రం శర్వానంద్ ని కన్ ఫ్యూజన్ లో పడేశాయి.
By: Ramesh Boddu | 3 Nov 2025 12:01 PM ISTయువ హీరోల్లో శర్వానంద్ కెరీర్ డేంజర్ ఫేజ్ లో ఉంది. ఏం చేసినా శర్వా సినిమాలు వర్క్ అవుట్ అవ్వట్లేదు. చివరగా మనమే అనే ప్రయత్నం చేసినా సరే అది వర్క్ అవుట్ కాలేదు. కాస్త గ్యాప్ తీసుకుని కెరీర్ మీద గట్టి ఫోకస్ తో వస్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం అతను 3 సినిమాలు చేస్తున్నాడు. అందులో రెండు సినిమాలైతే మాత్రం శర్వానంద్ ని కన్ ఫ్యూజన్ లో పడేశాయి. అదేంటి అంటే.. శర్వానంద్ హీరోగా రాం అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా నారి నారి నడుమ మురారి. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి రిలీజ్ పోస్టర్ వేశారు.
డిసెంబర్ 6న శర్వానంద్ బైకర్..
మరోపక్క శర్వానంద్ నటించిన బైకర్ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి ఒక సినిమా నెల ముందు అంటే డిసెంబర్ లో ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాడు శర్వానంద్. డిసెంబర్ 6న శర్వానంద్ బైకర్ తో వస్తున్నాడు. ఈ సినిమాను అభిలాష్ డైరెక్ట్ చేశాడు. లూజర్ వెబ్ సీరీస్ తో మెప్పించిన అభిలాష్ ఈసారి బైకర్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. సినిమా అంతా షూటింగ్ అయ్యాక సడెన్ గా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు.
ఇండియన్ తెర మీదే ఇలాంటి బైక్ రేస్ బ్యాక్ డ్రాప్ మూవీ రాలేదని మేకర్స్ చెబుతున్నారు. ఐతే ఈ సినిమా టీజర్ చూస్తే అది నిజమే అనిపించేలా ఉంది. శర్వానంద్ ఈ సినిమా కోసం చాలా బాగా కష్టపడ్డాడు. ఐతే శర్వానంద్ బైకర్ డిసెంబర్ లో, సంక్రాంతికి నారి నారి నడుమ మురారి ఇలా రెండు నెలల్లో రెండు సినిమాలు రిలీజ్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. అందుకే బైకర్ వస్తే నారి నారి నడుమ మురారిని వాయిదా వేయాలని చూస్తున్నారు అని ఒక రూమర్ వినిపిస్తుంది.
రెండు సినిమాల రిలీజ్ విషయంలో శర్వానంద్..
ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ MSVG తో పాటుగా ప్రభాస్ రాజా సాబ్, రవితేజ సినిమా ఉన్నాయి. వీటితో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు కూడా రేసులో దిగుతుంది. ఈ సినిమాల మధ్య నారి నారి నడుమ మురారి వచ్చి నలిగిపోవడం ఎందుకని సినిమాను ఫిబ్రవరి లేదా ఆ తర్వాతకు వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఆలోచన ఉంది అని ఒక రూమర్ వినిపిస్తుంది. ఐతే ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో శర్వానంద్ కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు.
సినిమా లేట్ గా వచ్చిన కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే మాత్రం తప్పకుండా శర్వానంద్ కెరీర్ ట్రాక్ లోకి ఎక్కుతుంది. ఈ రెండు మాత్రమే కాదు శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ లో భోగి సినిమా ఒకటి వస్తుంది. ఆ సినిమా కూడా ఆడియన్స్ లో మంచి బజ్ పెంచుకుంది.
