ఆ నారీ ఈ నారీ మధ్యలో..బ్యాచ్‌లర్ బకరా..!
యంగ్ టాలెంటెడ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఫన్ రైడ్ 'నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకుడు.
By: Tupaki Entertainment Desk | 10 Jan 2026 7:00 PM ISTయంగ్ టాలెంటెడ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఫన్ రైడ్ 'నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకుడు. సంయుక్త మీనన్, సాక్షీ వైద్య హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సుంక రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్, లిరికల్ వీడియోలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. సంక్రాంతి బరిలో పక్కా ఫ్యామిలీ ఫన్ రైడ్‌గా ప్రేక్షకుల అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది.
దీంతో సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్స్ విషయంలో కాస్త వెనకబడ్డ `నారీ నారీ నడుము మురారీ` టీమ్ సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలు ఆకట్టుకుంటుండటంతో తాజాగా టీమ్ మరో ఫన్నీ సాడ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఆ నారీ ఈ నారీ నడుమ నే మురారీ..ఆ సారీ..ఈ సారీ.. చెరో పక్క చేరీ.. చంపుతున్నాయ్.. అదోటైపు మల్లి.. ఇదోటైపు లిల్లీ.. దొరికిపోయా..బ్యాచులర్ బకరాలాగ చితికి పోయా..
అంటూ సాగే ఫన్నీ సాడ్ సాంగ్‌ని రామజోగయ్య శాస్త్రి రాయగా, అరవింద్ ఆలపించాడు.. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు అందించారు. సీరియస్ వేలో సాగుతూ ఫన్ ని క్రియేట్ చేసేలా ఉంది. పాటలోని సాడ్ నెస్‌ని ప్రజెంట్ చేస్తూనే రామజోగ్య శాస్త్రి తన పదాలతో ఫన్‌ని కూడా అదే స్థాయిలో పండించారు. ఈ పాటలో శర్వా వేసినస్టెప్పులు కూడా ఆకట్టుకుంటున్నాయి. శర్వా తన పంథాకు పూర్తి భిన్నంగా పక్కా ప్యామిలీ ఎంటర్ టైనర్‌తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సినిమాపై క్రియేట్ అయిన వైబ్ చూస్తుంటే ఈ సంక్రాంతికి శర్వా ఈ ఫన్ ఫ్యామిలీ డ్రామాతో కచ్చితంగా హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని, మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
ఏకే ఎంటర్ టైన్‌మెంట్ వారు నిర్మిస్తున్న ఈమూవీ చాలా రిచ్‌గా ఉంది. తాజా సాంగ్‌లోని విజువల్స్ పాటకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇప్పటికే మంచి బజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన టీమ్ సినిమా ఫలితంపై ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. ఇదిలా ఉంటే మారుతి డైరెక్ట్ చేసిన `మహానుభావుడు` తరువాత శర్వాకు ఒక్కటంలే ఒక్క హిట్టు రాలేదు. శర్వా హిట్టు మాట విని దాదాపు ఏళ్లవుతోంది. మధ్యలో శ్రీకారం, ఒకే ఒక జీవితం వంటి సినిమాలతో ఆకట్టుకున్నా కానీ అవి సూపర్ హిట్ అనిపించుకోలేకపోయాయి.
గత కొన్నేళ్లుగా తన మార్కు సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `నారీ నారీ నడుమ మురారీ`తో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అంటున్నారు. ఈ మూవీతో పాటు శర్వా మరో రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు. బైక్ రేస్ నేపథ్యంలో స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న `బైకర్`, కొత్త తరహా కథతో రూపొందుతున్న `భోగి` సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
