Begin typing your search above and press return to search.

రేసులో ఉన్నానంటూ పోస్టర్ తో చెప్పేశాడుగా..!

చార్మింగ్ స్టార్ శర్వానంద్ స్ట్రగులింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనమే తర్వాత శర్వానంద్ కాస్త గ్యాప్ తో 3 సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు.

By:  Ramesh Boddu   |   20 Oct 2025 12:31 PM IST
రేసులో ఉన్నానంటూ పోస్టర్ తో చెప్పేశాడుగా..!
X

చార్మింగ్ స్టార్ శర్వానంద్ స్ట్రగులింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనమే తర్వాత శర్వానంద్ కాస్త గ్యాప్ తో 3 సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. అందులో నారి నారి నడుమ మురారి సినిమాతో రాబోతున్నాడు. సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఐతే శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.


సామజవరగమన తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా..

దీపావళి రోజు రిలీజ్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశారు శర్వానంద్ అండ్ టీం. శర్వానంద్, రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న నారి నారి నడుమ మురారి సినిమా ఈసారి సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ లు ఉన్నా తన సినిమాతో పోటీకి సై అనేస్తున్నాడు శర్వానంద్. నారి నారి నడుమ మురారి సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సామజవరగమన తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు మళ్లీ అదే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నారి నారి నడుమ మురారితో వస్తున్నాడు. ఐతే సంక్రాంతి రేసులో మెగాస్టార్ మన శంకర వరప్రసాద్, రవితేజ కిషోర్ తిరుమల మూవీ, ప్రభాస్ రాజా సాబ్ తో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు ఉన్నాయి. ఇప్పుడు నారి నారి నడుమ మురారితో శర్వానంద్ కూడా సంక్రాంతికే వస్తా అంటున్నాడు.

పొంగల్ కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా..

సంక్రాంతికి వచ్చే ఫ్యామిలీ మూవీస్ అన్నీ కూడా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. పొంగల్ కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా వస్తే అది సూపర్ హిట్ అన్నట్టే. అందుకే ఈసారి సంక్రాంతికి అన్నీ కూడా ఎంటర్టైనర్స్ నే దించుతున్నారు. రాజా సాబ్ వస్తే అదొక్కటే థ్రిల్లర్ కానీ మిగతా సినిమాలన్నీ కూడా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ కథలతోనే వస్తున్నాయి.

వారిలో శర్వానంద్ నారి నారి నడుమమురారి కూడా వస్తుంది. ఆల్రెడీ సామజవరగమన తో సత్తా చాటిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈసారి రెండో అటెంప్ట్ తో కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. శర్వానంద్ కూడా పొంగల్ కి తన సినిమాతో సత్తా చాటి హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా.. సంపత్ నందితో భోగి అని మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో శర్వానంద్ ఎలాగైనా సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.