'ఆల్ఫా గర్ల్' డబుల్ ధమాకా ట్రీట్: శార్వరి ఒకేసారి రెండు శుభవార్తలు!
బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ, ఆల్ఫా గర్ల్ శార్వరి వాఘ్ ప్రస్తుతం కెరీర్‌లో సూపర్ ఫామ్‌లో దూసుకుపోతోంది.
By: Sivaji Kontham | 1 Aug 2026 7:00 AM ISTబాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ, ఆల్ఫా గర్ల్ శార్వరి వాఘ్ ప్రస్తుతం కెరీర్‌లో సూపర్ ఫామ్‌లో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్న ఈ భామ, తన అభిమానులకు ఒకేసారి రెండు అదిరిపోయే అప్‌డేట్‌లతో డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చింది. శార్వరి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
శార్వరి అందించిన మొదటి బిగ్ అప్‌డేట్ తన తదుపరి సినిమా ప్రాజెక్ట్ గురించే! `మై వాపస్ ఆవుంగా` చిత్రంలో నటుడు వేదాంగ్ రైనాతో కలిసి శార్వరి పండించిన ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రేజీ పెయిర్ మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని చూసి ఇంప్రెస్ అయిన అగ్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ.. వీరిద్దరినీ తన తదుపరి రొమాంటిక్ డ్రామాలో కథానాయక-కథానాయకులుగా నటింపజేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శార్వరి నటనా పటిమపై నమ్మకంతో ఇంతియాజ్ అలీ ఈ సరికొత్త ప్రేమకథను ప్లాన్ చేస్తుండటం శార్వరి ఫ్యాన్స్‌కు పెద్ద శుభవార్తగా మారింది.
ఇక శార్వరి అందించిన రెండో ధమాకా అప్‌డేట్.. తను నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `యే ప్రేమ్ మోల్ లియా` షూటింగ్ విజయవంతంగా పూర్తికావడం. దర్శక దిగ్గజం సూరజ్ బార్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శార్వరి కథానాయికగా నటిస్తోంది. ముంబైలో జరిగిన చివరి రోజు చిత్రీకరణ అనంతరం పంచుకున్న పిక్చర్ పర్ఫెక్ట్ `ర్యాప్ ఫోటో`లో సాంప్రదాయ ఎరుపు రంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న శార్వరి లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన శార్వరి తొలిసారిగా జంటగా నటిస్తోంది. సూరజ్ బార్జాత్యా మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు నేటి జెన్-జీ కోణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కథలో శార్వరి పాత్ర ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుందని సమాచారం. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజాలతో కలిసి శార్వరి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన నటనకు దక్కిన పెద్ద గుర్తింపుగా భావించవచ్చు.
ఇలా ఒకవైపు ఇంతియాజ్ అలీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌తో కొత్త రొమాంటిక్ ప్రాజెక్ట్ చర్చలు, మరోవైపు సూరజ్ బార్జాత్యా తెరకెక్కించిన `యే ప్రేమ్ మోల్ లియా` మూవీ నవంబర్ 27న విడుదల కానుండటంతో శార్వరి వాఘ్ పేరు బాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. ఒకేసారి ఇలాంటి రెండు క్రేజీ సినిమాలతో ముందుకు సాగుతున్న ఈ ఆల్ఫా గర్ల్.. మునుముందు వెండితెరపై మరింత సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
