నడుము ఒంపులతో గిలిగింతలు పెడుతున్న యంగ్ బ్యూటీ!
2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీ ఆజాదీ కే లియే అనే వెబ్ సిరీస్ తో నటన రంగంలోకి వచ్చి.. 2021లో బంటీ ఔర్ బబ్లీ 2 సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది
By: Madhu Reddy | 17 Dec 2025 9:00 PM ISTప్రముఖ నటి శార్వరీ వాగ్ సహాయ దర్శకురాలిగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. 2020లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీ ఆజాదీ కే లియే అనే వెబ్ సిరీస్ తో నటన రంగంలోకి వచ్చి.. 2021లో బంటీ ఔర్ బబ్లీ 2 సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక తెలుగులో 2022లో వచ్చిన మహారాజా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
1996 జూన్ 14న ముంబై మహారాష్ట్రలో జన్మించిన ఈమె ఎవరో కాదు ప్రముఖ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మనవరాలు. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న శార్వరీ.. తాజాగా గ్లామర్ వలకబోస్తూ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వయ్యారంగా బెడ్ పై పడుకొని తన అందాల సోయగాలతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా అమ్మడి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
శార్వరీ సినిమాల విషయానికి వస్తే.. ముంజ్యా సినిమాలో లీడ్ రోల్ పోషించిన ఈమె ఆల్ఫా సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఈమెతో పని చేయడం కోసం హీరోలు కూడా ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
అటు అందంతోనే కాదు ఇటు నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఇప్పుడు వరుస సినిమాలు ప్రకటిస్తూ ఇటు సినిమాలలో కూడా బిజీగా మారింది. ఏది ఏమైనా శార్వరి ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
