Begin typing your search above and press return to search.

దిశా పటానీ దారిలోనే శర్వరీ ..CK బ్రాండ్ ప్రమోషన్లతో రచ్చ!

బాలీవుడ్ గ్లామర‌స్‌ బ్యూటీ దిశా పటానీ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఇన్నర్‌వేర్ బ్రాండ్ `కెల్విన్ క్లైన్`- CK) ప్రచారకర్తగా సోషల్ మీడియాను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.

By:  Sivaji Kontham   |   16 July 2026 1:00 AM IST
దిశా పటానీ దారిలోనే శర్వరీ ..CK బ్రాండ్ ప్రమోషన్లతో రచ్చ!
X

బాలీవుడ్ గ్లామర‌స్‌ బ్యూటీ దిశా పటానీ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఇన్నర్‌వేర్ బ్రాండ్ 'కెల్విన్ క్లైన్'- CK) ప్రచారకర్తగా సోషల్ మీడియాను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రతికూల కామెంట్లు వచ్చినా లెక్కచేయకుండా చేసిన బోల్డ్ ఫోటోషూట్లు ఆ బ్రాండ్‌కు భారీ పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సరిగ్గా అదే దారిలో యంగ్ హీరోయిన్ శర్వరీ వాఘ్ కూడా పయనిస్తోంది. తన తాజా చిత్రం 'ఆల్ఫా' థియేటర్లలో ఉన్న ఈ స‌మ‌యంలోనే..త‌న‌ ఇన్‌స్టా పోస్టులను ప‌రిశీలిస్తే.. కెల్విన్ క్లైన్ దుస్తులను ధరిస్తూ చేసిన హాట్ ప్రమోషన్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో దిశా పటానీ లాగే శర్వరీ కూడా ఈ బ్రాండ్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుందంటూ నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




సీకే ప్ర‌చారం కోసం శార్వ‌రి ఎంత తీసుకుంటోంది? అంటే.. సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ బ్రాండ్ల ప్రచారం కోసం సెలబ్రిటీల పారితోషికాలు చాలా విభిన్నంగా ఉంటాయి. శర్వరీ వాఘ్ ఈ ప్రచారం కోసం ఎంత వసూలు చేస్తోందనే అధికారిక వివరాలు బయటకు రాలేదు. అయితే పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం.. శర్వరీ లాంటి క్రేజీ యంగ్ హీరోయిన్లు సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్ల కోసం ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఒప్పందాల కింద ఒక్కో పోస్ట్‌కు లేదా వార్షిక ఒప్పందానికి కోట్లలోనే వసూలు చేస్తుంటారు. శార్వ‌రి వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో 'కెల్విన్ క్లైన్' వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్ల నుండి ఆమె భారీ స్థాయిలోనే పారితోషికాన్ని అందుకుంటున్నట్లు సమాచారం.




ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న `షాంపైన్` సాంగ్ కామెంట్లు!

ఆలియాతో క‌లిసి బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో శార్వ‌రి తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్న షాంపైన్ వీడియో సాంగ్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ''షాంపైన్ సాంగ్ వచ్చేసింది, మీ సమీప థియేటర్లలో 'ఆల్ఫా' చిత్రాన్ని చూడండి!'' అంటూ శర్వరీ పెట్టిన పోస్ట్‌కు నిమిషాల వ్యవధిలోనే లైకులు, కామెంట్ల వర్షం కురిసింది. ఈ పోస్ట్‌లో ఆమె గ్లామరస్ లుక్ చూసి అభిమానులు మైమరచిపోతున్నారు.




నెటిజన్లు శర్వరీ అందాన్ని, త‌న‌ డాన్స్ మూమెంట్స్‌ను తెగ పొగిడేస్తున్నారు. శార్వ‌రి వేసిన స్టెప్పుల నుంచి ఇంకా బయటపడలేకపోతున్నామంటూ పలువురు అభిమానులు తమ ఆరాధనను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. ''ఈ తరం జూహీ చావ్లా'' అంటూ ఒకరు అభివర్ణించగా... ఎలిగెన్స్‌కు ఒక రూపం ఉంటే అది నువ్వే అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు శార్వ‌రిని టాలీవుడ్ సీనియర్ నటి శ్రియ శరన్ తో పోలుస్తూ.. మొదటి లుక్‌లో శ్రియ అనుకున్నామని సరదాగా రాసుకొచ్చారు.

మరోవైపు శర్వరీ నటనలోని వైవిధ్యాన్ని అభినందిస్తూ ఒక సుదీర్ఘమైన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఆల్ఫా' సినిమాలో 'దుర్గ' పాత్రలో త‌న నటన, ఇంటెన్సిటీ అద్భుతంగా ఉన్నాయని.. ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేసే త‌న క‌మిట్ మెంట్ కార‌ణంగానే నటన చాలా నిజాయితీగా అనిపిస్తుందని ఒక వీరాభిమాని కొనియాడారు. ఈ సినిమాలో శర్వరీ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు త‌న కెరీర్ గ్రాఫ్ ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిందంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

గ్లామర్ హంగామా పక్కన పెడితే... కొంతమంది సామాజిక స్పృహ కలిగిన నెటిజన్లు శర్వరీకి ఒక గట్టి రిక్వెస్ట్ పంపారు. లడఖ్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్షపై స్పందించాలని వారు కోరారు. సెలబ్రిటీలుగా సమాజంలో మీకు ఉన్న భారీ ఫాలోయింగ్ - రీచ్‌ను ఇలాంటి ప్రజా సమస్యలపై గళం విప్పడానికి ఉపయోగించాలని, ఒక చిన్న పోస్ట్ ద్వారా అయినా సరే ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని హితవు పలికారు.

ఇక ఈ పోస్ట్‌లో శర్వరీ ప్రముఖ బ్రాండ్ 'కెల్విన్ క్లైన్' దుస్తులు ధరించడంపై కూడా కొందరు భిన్నంగా స్పందించారు. ఇది సినిమా ప్రమోషన్‌లా కాకుండా సదరు బ్రాండ్ యాడ్‌లా కనిపిస్తోందని కొందరు ఆటపట్టించారు. ఏదేమైనా.. ఒకవైపు హాట్ ఇన్‌స్టా కామెంట్లు... మరోవైపు 'ఆల్ఫా' చిత్రంలో ఏజెంట్ దుర్గగా చూపించిన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో శర్వరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.