దానికెంతో కమిట్‌మెంట్ అవసరం
దానికి తోడు ఈ మూవీ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మొదటి ఉమెన్ సెంట్రిక్ మూవీ కావడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ నెలకొంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 Dec 2025 2:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, శార్వరి కీలక పాత్రల్లో వస్తోన్న సినిమా ఆల్ఫా. ఉమెన్ సెంట్రిక్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండటంతో దీనిపై మంచి బజ్ నెలకొంది. దానికి తోడు ఈ మూవీ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మొదటి ఉమెన్ సెంట్రిక్ మూవీ కావడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ నెలకొంది.
ఆలియాతో వర్క్ చేయడం చాలా స్పెషల్
ఇప్పటివరకు ఈ యూనివర్స్ లో ఎక్కువగా హీరో సెంట్రిక్ సినిమాలే వచ్చి అవే ఆధిపత్యం చెలాయించగా, ఇప్పుడు ఆల్ఫా సినిమాతో ఈ యాక్షన్ బ్రాండ్ లో ఓ కొత్త మార్పు రాబోతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శార్వరి మాట్లాడుతూ, ఆలియా భట్ తో కలిసి వర్క్ చేయడం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆలియా లాంటి నటితో స్క్రీన్ ను షేర్ చేసుకోవడం క్రమశిక్షణను పెంచడంతో పాటూ క్రియేటివ్ ప్రాసెస్ పై ఫోకస్ ను పెంచుతుందని చెప్పారు.
నా వర్క్ పై అదెంతో ప్రభావం చేసింది
ఆలియా పాత్ర కోసం ప్రిపేర్ అయ్యే విధానం, తన పెర్ఫార్మెన్స్ ను గమనించాక అది తన వర్క్ ను ఎంతో ప్రభావితం చేసిందని ఆమె వివరించారు. ఆలియాతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను శార్వరి ఫ్రెండ్లీగా ఉందని చెప్పడానికి బదులు, ఆ అనుభవం తన ఫ్యూచర్ ప్రాజెక్టులను రూపొందించే లెర్నింగ్ ఫేజ్ గా అభివర్ణించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆల్ఫా మూవీ గురించి కూడా శార్వరి మాట్లాడారు.
ఇప్పటికే స్పై యూనివర్స్ లో పలు సినిమలు
మెయిన్ స్ట్రీమ్ హిందీ సినిమాల్లో ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయని, అవి సక్సెస్ అవడానికి చాలా స్ట్రాంగ్ కమిట్‌మెంట్ అవసరమని ఆమె చెప్పుకొచ్చారు. ఆల్ఫా లాంటి ప్రాజెక్టులు ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో పరీక్షిస్తుందని ఆమె అన్నారు. శివ రావాయిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా ఇప్పటికే ఈ స్పై యూనివర్స్ లో టైగర్, వార్, పఠాన్ లాంటి సినిమాలు వచ్చి ఈ స్పై యూనివర్స్ ను మరింత స్పెషల్ గా మార్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటూ ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా స్పై యూనివర్స్ యొక్క పరిధిని ఇంకా విస్తరిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది. మరి యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో వచ్చిన మిగిలిన సినిమాల్లానే ఈ సినిమా కూడా మంచి ఆదరణను అందుకుంటుందో లేదో చూడాలి.
