Begin typing your search above and press return to search.

బైకర్: శర్వానంద్ ధైర్యం వెనుక కారణమేంటి..?

శర్వానంద్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అతని సినిమాల్లో ఉండే ఎమోషన్స్ కు ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి.

By:  M Prashanth   |   26 March 2026 12:35 PM IST
బైకర్: శర్వానంద్ ధైర్యం వెనుక కారణమేంటి..?
X

టాలీవుడ్ లో శర్వానంద్ అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కథలు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎప్పుడూ కొత్తదనం కోసమే తాపత్రయపడుతుంటారు. అందుకే ప్రేక్షకుల్లో శర్వానంద్ సినిమా అంటే ఏదో ఒక వెరైటీ పాయింట్ ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలతో మెప్పించిన శర్వా, ఇప్పుడు రూటు మార్చి 'బైకర్' అనే స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత శర్వానంద్ కెరీర్ లో ఇది ఒక సాహసమే అనిపిస్తోంది.

సాధారణంగా తెలుగులో స్పోర్ట్స్ సినిమాలు అంటే క్రికెట్ లేదా కబడ్డీ వంటి ఆటల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ మొదటిసారి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవడం నిజంగా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు మన దగ్గర ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రేసింగ్ సినిమా రాలేదు. బైక్ రేసింగ్ అంటే కేవలం యూత్ కు మాత్రమే కనెక్ట్ అయ్యే అంశం అని కొందరు భావిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రయోగాత్మక కథను ఎంచుకోవడం వెనుక శర్వానంద్ ధైర్యం ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

శర్వానంద్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అతని సినిమాల్లో ఉండే ఎమోషన్స్ కు ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. 'బైకర్' సినిమాలో కూడా కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా, తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ను దర్శకుడు బలంగా చూపించబోతున్నారని సమాచారం. రాజశేఖర్ తో శర్వానంద్ కు వచ్చే సీన్లు క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాను గుర్తు చేసేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎమోషనల్ టచ్ వల్లే శర్వానంద్ ఈ కథపై అంత నమ్మకంగా ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా టీజర్ లోని విజువల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయిలో రేసింగ్ సీన్లను చిత్రీకరించడం వెనుక చిత్ర యూనిట్ పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. శర్వానంద్ కూడా ఈ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఒక ప్రొఫెషనల్ రేసర్ లా కనిపించడానికి తీసుకున్న శిక్షణ సినిమాకు బాగా ప్లస్ అయ్యిందట. ఇలాంటి కంటెంట్ క్లిక్కయితే అయితే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ దగ్గర ఇది ఒక కొత్త ట్రెండ్ కు నాంది పలికే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రేక్షకులు రొటీన్ కథలను పక్కన పెట్టి, సరికొత్త అనుభూతిని ఇచ్చే సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో 'బైకర్' వంటి సినిమా రావడం టాలీవుడ్ మేకింగ్ స్టైల్ ను కూడా మార్చేస్తుంది. శర్వానంద్ కెరీర్ లో ఇది నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో సాగబోయే ప్రయాణం. అతని గత సినిమాల మాదిరిగా కాకుండా, చాలా రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే శర్వానంద్ మార్కెట్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.

ఏప్రిల్ 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒక స్పోర్ట్స్ డ్రామాను ఎమోషన్స్ తో కలిపి చెప్పడం అనేది సవాలుతో కూడుకున్న పని. కానీ శర్వానంద్ గత రికార్డులు చూస్తుంటే, మరోసారి తన సెలక్షన్ తో అందరినీ ఆశ్చర్యపరిచేలాగే ఉన్నారు. ఈ రేసింగ్ లో శర్వానంద్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.