రాధిక జర్నీ.. శరత్ కుమార్ కామెంట్స్ వైరల్..!
ఐతే ఇండస్ట్రీలో రాధిక 45 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నా కూడా ఎవరు ఒక వేడుక చేయలేదని అన్నారు శరత్ కుమార్.
By: Ramesh Boddu | 18 Oct 2025 8:00 PM ISTకోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ అటు తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా రాణిస్తున్నారు. ఈమధ్యనే మంచు విష్ణు చేసిన కన్నప్ప సినిమాలో ఆయన తన నటనతో మెప్పించారు. లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ సినిమాలో కూడా మంచి రోల్ చేశారు. కీర్తీశ్వరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ కి జతగా ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటిన రాధిక..
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శరత్ కుమార్ తన జర్నీ గురించి మాట్లాడారు. సూపర్ స్టార్ రజనీ సినీ పరిశ్రమ గ్రీస్ పూసిన పోల్ లాంటిది పైకి వెళ్లినట్టే ఉంటుంది కానీ ఎప్పుడు జారుతూనే ఉంటామని అన్నారని.. మనం జారుతుంటా మరొకరు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ఇక రాధిక గురించి చెబుతూ సినిమాల్లోనే కాదు స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటిందని అన్నారు.
ఐతే ఇండస్ట్రీలో రాధిక 45 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నా కూడా ఎవరు ఒక వేడుక చేయలేదని అన్నారు శరత్ కుమార్. అదే మేల్ యాక్టర్స్ కి ఈవెంట్స్ చేస్తారని ఫిమేల్ యాక్టర్ కి అలాంటివి చేయరని ఆయన అన్నారు. ఐతే ఇదేదో తానొక కంప్లైంట్ లా చెప్పట్లేదని.. మేల్ యాక్టర్స్ కి చేసినట్టుగా ఫంక్షన్స్ ఫిమేల్ యాక్టర్స్ కి చేయరని.. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రాధిక చాలా సినిమాలు చేసింది. ఎక్కడ ఒక్క ఫంక్షన్ చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదని అన్నారు శరత్ కుమార్.
హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ..
హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ సినిమాల్లో నటిస్తున్నా కూడా వాళ్లకు అంత స్కోప్ ఉండదు. ఐతే ఇప్పటికీ కెరీర్ ని కొనసాగిస్తున్న హీరోయిన్స్ ని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వారిని ఇంకాస్త ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి రోల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది.
రాధిక ఒక్కరే కాదు 30, 40 ఏళ్లు పరిశ్రమలో ఉన్న వారికి ప్రత్యేకంగా హీరోయిన్స్ కి సరైన గుర్తింపు ఇంకా ఒక మంచి వేడుక చేయాలని ఎవరు ముందు రావట్లేదని కొందరు చెబుతున్నారు. మరి శరత్ కుమార్ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని తర్వాత అయినా రాధిక తో పాటు అలాంటి యాక్టర్స్ ని సత్కరించే కార్యక్రమాలు జరుగుతాయో లేదో చూడాలి. తమిళ్ లోనే కాదు ఈమధ్య తెలుగులో కూడా శరత్ కుమార్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఓ పక్క వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తెలుగులో మంచి రోల్స్ చేస్తూ రాణిస్తున్నారు. తెలుగులో కూతురు వరలక్ష్మి చేస్తున్న సినిమాల పట్ల శరత్ కుమార్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగు ఆడియన్స్ ప్రేమను పొందినందుకు వరలక్ష్మి విషయంలో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
