ఫోటోటాక్ : లవ్లీ బ్యూటీ మిర్రర్ షో అదుర్స్
లవ్లీ సినిమాతో 2012లో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శాన్వి.
By: Ramesh Palla | 20 Jan 2026 6:15 PM ISTలవ్లీ సినిమాతో 2012లో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శాన్వి. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంటనే అడ్డా సినిమాలో నటించే అవకాశం దక్కింది. అయితే అడ్డా సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. ఆ సమయంలోనే కన్నడంలో చంద్రలేఖ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ద్వారా లక్ కలిసి వచ్చింది. తెలుగులో పెద్దగా ఆఫర్లు రాని సమయంలో కన్నడంలో ఈ అమ్మడు బిజీ అయింది. దశాబ్ద కాలం పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి అక్కడ ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కేవలం కన్నడ సినిమాల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇతర భాషల్లో కూడా సినిమా ఆఫర్లు రావడం తో అన్ని చోట్ల ఈమె కనిపిస్తూ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బిజీగానే ఉంది.
లవ్లీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు
ఈ లవ్లీ బ్యూటీ ఇప్పటికీ బిజీగా ఉండటానికి కారణం ఆమె అందం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సినిమా ఇండస్ట్రీకి అడుగు పెట్టి చాలా కాలం అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె అందం పెరుగుతూ వస్తుంది కానీ తగ్గడం లేదు అనేది చాలా మంది చేసే కామెంట్. అందుకే ఆమె ఇండస్ట్రీలో బిజీ బిజీగా సినిమాలు చేసేందుకు గాను ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి నటన ప్రతిభ, అందుకు తగ్గట్టుగా నాజూకు అయిన ఫిజిక్ కావడంతో శాన్వి ఇప్పటికీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల ప్రమోషన్ కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. అదే సమయంలో తన రెగ్యులర్ డే టు డే లైఫ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సైతం శాన్వి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం జరుగుతుంది.
శాన్వి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు వైరల్
తాజాగా శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగానే ఈ అమ్మడి అందం ముందు అంతా ఆహా అనాల్సిందే. అలాంటిది ఇలా క్లీ వేజ్ షో చేస్తూ మిర్రర్ ముందు నిల్చుని ఫోజులు ఇస్తే ఇంకా ఏమైనా ఉందా అన్నట్టు ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మిర్రర్ సెల్ఫీలో శాన్వి మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో పోస్ట్ చేసిన అందాల ఆరబోత ఫోటోలతో పోల్చితే ఈ ఫోటోలు ఇంకాస్త అందంగా ఉన్నాయి అనిపిస్తోంది అంటూ ఆమె ఫాలోవర్స్‌తో పాటు పలువురు నెటిజన్స్ ముచ్చటించుకుంటున్నారు. ఇంత అందంగా ఉన్న శాన్వికి తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కక పోవడం విచిత్రంగా ఉంది అంటూ కొందరు తెలుగు ప్రేక్షకులు, తెలుగు నెటిజన్స్ ఈ ఫోటోలకు కామెంట్ చేస్తూ చర్చించుకుంటున్నారు.
కన్నడ మూవీ త్రిశూలంతో..
ఈమధ్య కాలంలో కేవలం కన్నడంలోనే కాకుండా మరాఠీ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. సినిమాలతో పాటు సమాంతరంగా ఈమె వెబ్ సిరీస్‌లు చేస్తే బాగుంటుంది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వయసు పెరిగిన కొద్ది మరింత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడిని చూస్తే ముందు ముందు అయినా టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకుని, తెలుగు సినిమాలతో బిజీ అవుతుందా అని కొందరు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి శాన్వి త్రిశూలం అనే కన్నడ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కాకుండా మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అతి త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఒక తెలుగు సినిమా కోసం కూడా ఈమె వద్ద చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఆ సినిమా కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
