Begin typing your search above and press return to search.

చీరకట్టులో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ కి తెరలేపిన షాన్వీ!

ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి అంటే గ్లామర్ ఒలకబోస్తే చాలదు.. అటు ఫ్యాషన్ ప్రియులను కూడా మెప్పించగలగాలి.

By:  Madhu Reddy   |   27 Jun 2026 10:34 AM IST
చీరకట్టులో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ కి తెరలేపిన షాన్వీ!
X

ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి అంటే గ్లామర్ ఒలకబోస్తే చాలదు.. అటు ఫ్యాషన్ ప్రియులను కూడా మెప్పించగలగాలి. అందుకే రోజుకు ఒక విభిన్నమైన ట్రెండీ ఔట్ఫిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు కొంతమంది బ్యూటీలు. అలాంటి వారిలో షాన్వి శ్రీవాత్సవ కూడా ఒకరు. అందానికి అందం, అందానికి తగ్గట్టు అభినయంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేటెస్ట్ ట్రెండీ ఔట్ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. చీరను తలపిస్తున్న లేటెస్ట్ అవుట్ ఫిట్ చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.




ఆరెంజ్ కలర్ సిల్క్ శారీ కట్టుకున్న ఈమె దీనికి కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన షోల్డర్ లెస్ బ్లౌజ్ ధరించి ఆకట్టుకుంది. ఇక కొంగును ఒకవైపు చేతి నుంచి తీసుకున్న ఈమె మరొకవైపు నడుము మీద చెయ్యి పట్టుకుని చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక నాని ది ప్యారడైజ్ లో వైరల్ గా మారిన జడలుతో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఔట్ ఫిట్ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా ఇటు ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా అలరిస్తున్నాయి.




షాన్వి శ్రీవాత్సవ 1993 డిసెంబర్ 8న ఉత్తరప్రదేశ్ వారణాసిలో జన్మించింది. ఉత్తర ప్రదేశ్ లోని అజంగడ్ లోని చిల్డ్రన్ కాలేజీలో పాఠశాల విద్యను , ముంబైలోని నాగూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2016లో బీకాం డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఈమెకు ఒక అన్నయ్య అలాగే విదిషా శ్రీ వాస్తవ అనే ఒక అక్క కూడా ఉన్నారు. పైగా ఈమె నటి కూడా కావడం విశేషం. కాలేజ్ లో చదువుతున్న సమయంలోనే మోడల్గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. చదువుకునే సమయంలోనే 2012లో బి జయ దర్శకత్వం వహించిన లవ్లీ అనే చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడ్డ చిత్రంలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినిగా తన పాత్రతో ఆకట్టుకుంది.




ఇక రామ్ గోపాల్ వర్మ తెలుగు పొలిటికల్ డ్రామా రౌడీలో మంచు విష్ణు సరసన ఒక చిన్న పాత్ర కోసం ఎంపిక చేశారు. ఒక తర్వాత 2014లో హారర్ కామెడీ మూవీ చంద్రలేఖ తో కన్నడ సినీ రంగంలో అరంగేట్రం చేసింది. ఎక్కువగా కన్నడ, మలయాళం లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. 2014 తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కానీ మరాఠీలో సినిమాలు చేస్తూ అక్కడి ఆడియన్స్ ని కూడా అలరిస్తోంది.ప్రస్తుతం త్రిశూలం అనే కన్నడ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ గ్లామర్ ఒలకబోసే ప్రయత్నం చేస్తోంది.