ఫోటో స్టోరి: లవ్‌లీ శాన్వి కిల్లింగ్
తనదైన అందం ప్రతిభతో దశాబ్ధం పైగానే కెరీర్ బండి నడిపించేసింది శాన్వీ శ్రీవత్సవ. ఈ కన్నడ బ్యూటీ `లవ్‌లీ` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది.
By: Sivaji Kontham | 13 Aug 2025 9:53 AM ISTతనదైన అందం ప్రతిభతో దశాబ్ధం పైగానే కెరీర్ బండి నడిపించేసింది శాన్వీ శ్రీవత్సవ. ఈ కన్నడ బ్యూటీ `లవ్‌లీ` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి బి.జయ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సుశాంత్, మంచు విష్ణు లాంటి హీరోల సరసన నటించింది. కానీ ఇక్కడ ఆశించిన విజయాలు దక్కకపోవడంతో, అటుపై శాన్వీ పూర్తిగా కన్నడ పరిశ్రమకే అంకితమైంది. బహుభాషా చిత్రం `శ్రీమన్నారాయణ`లో రక్షిత్ శెట్టి సరసన నటించి మెప్పించింది. మహావీర్యార్, దేవయాని వంటి కన్నడ చిత్రాలు శాన్వీకి గుర్తింపును తీసుకొచ్చాయి.
అయితే శాన్వికి సోషల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు నిరంతర ఫోటోషూట్ లతో విరుచుకుపడుతోంది. ఇటీవల మాల్దీవుల విహారంలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్ని షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. వీలున్న ప్రతి సారీ తన యూనిక్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఈ యంగ్ బ్యూటీ గుబులు పుట్టిస్తోంది. తాజాగా శాన్వీ తన టోన్డ్ అందాలను ఆవిష్కరిస్తూ అదిరిపోయే ఫోటోషూట్ లో పాల్గొంది. వైట్ అండ్ వైట్ డిజైనర్ షర్ట్ ధరించిన శాన్వీ థై అందాలను ఎలివేట్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. 'వేర్ కామ్ బ్లూమ్స్' అంటూ ఈ ఫోటోకి సింపుల్ క్యాప్షన్ ని జోడించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. శాన్వీ టోన్డ్ లెగ్స్ సౌందర్యం ఆకర్షిస్తోందంటూ కొందరు అభిమానులు వ్యాఖ్యానించారు. శాన్వీ స్టన్నింగ్ - కిల్లింగ్ అంటూ కొందరు వ్యాఖ్యానించారు.
శాన్వీ కన్నడ సినిమా 'ఉగ్రం' రీమేక్ తో మరాఠాలోకి ఈ భామ అడుగుపెడుతోందని కథనాలొచ్చాయి. రాంతి అనే టైటిల్ తో అది అక్కడ తెరకెక్కింది. తదుపరి 'త్రిశూలం' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రిలీజై మంచి విజయం సాధిస్తుందని శాన్వీ భావిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ ఎందుకనో వెబ్ సిరీస్ లలో అవకాశాలొచ్చినా నటించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.
