Begin typing your search above and press return to search.

లవ్ లీ బ్యూటీ అదృష్టం మారనుందా.. స్టార్ హీరో రేస్ కి ఆహ్వానం!

అయితే సడన్ గా ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

By:  Madhu Reddy   |   18 Oct 2025 2:16 PM IST
లవ్ లీ బ్యూటీ అదృష్టం మారనుందా.. స్టార్ హీరో రేస్ కి ఆహ్వానం!
X

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతమందికి అనూహ్యంగా అదృష్టం వరించి.. వరుస అవకాశాలు తలుపు తడితే.. మరికొంతమందికి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో కాస్త తడబడి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. ఇంకొంతమంది వరుస ఫ్లాప్ లు ఎదురైతే.. అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిలో శాన్వి శ్రీవాత్సవ కూడా ఒకరు.. 2023లో ఈమె నటించిన మరాఠీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. దీంతో అసలు ఈమె ఏమైంది? ఎక్కడ ఉంది? అని అభిమానులు కూడా ఆరా తీశారు.


అయితే సడన్ గా ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇంస్టాగ్రామ్ లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్, ఆయన సతీమణి తో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా కరిమోటర్ స్పీడ్ రేస్ కి ప్రముఖ నిర్మాత రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్ర నిర్మాత విజయ్ వర్గీస్ మూలన్ ఆహ్వానం మేరకు వెళ్లినట్టు తన పోస్టు ద్వారా పంచుకుంది. అంతేకాదు ఇందులో ఆర్.మాధవన్ రేస్ లో పాల్గొనబోతుండగా.. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక్కడ వీరితో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.." ఉన్నతమైన వ్యక్తులతో కలిసి పంచుకునే క్షణాలను మాటలలో వివరించలేము" అంటూ తెలిపింది. అంతేకాదు ఈ ఈవెంట్ కి తనను ఆహ్వానించినందుకు నిర్మాత విజయ్ మూలన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.


ఇకపోతే ఇదే ఫోటోల కింద 24 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిశాను. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటూ క్యాప్షన్ జోడించడంతో ఆర్ మాధవన్ తదుపరి చిత్రంలో ఈమెకు అవకాశం కల్పించబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈమె అదృష్టం మారినట్టే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై నిజా నిజాలు త్వరలోనే తెలియాల్సి ఉంది.


రాంగోపాల్ వర్మ తొలి తెలుగు రాజకీయ నాటక చిత్రం రౌడీ సినిమా ద్వారా మంచు విష్ణు సరసన హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. కానీ 2012లో వచ్చిన ' లవ్ లీ ' అనే చిత్రం ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత అడ్డా సినిమాలో కూడా నటించింది. ఇక చంద్రలేఖ అనే కన్నడ సినిమాలో నటించాక.. తాను తొలి సంతకం చేసిన రౌడీ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ప్యార్ మే పడిపోయానే వంటి చిత్రంలో నటించిన ఈమె . ఆ తర్వాత మరాఠీ, కన్నడ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకుంది.