బెడ్డింగ్ టైమ్.. నైటీలో అందాలు ఆరబోస్తున్న శాన్వీ!
అందులోనూ నైటీ ధరించి మరీ అందాలు ఆరబోయడంతో ఇది చూసిన నెటిజన్స్ ఇదో ట్రెండీ ఫోటో షూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు అందాల తార శాన్వీ శ్రీ వాస్తవ.
By: Madhu Reddy | 9 Feb 2026 11:00 PM ISTపాపులారిటీని సంపాదించుకోవడానికి సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ ను వేదికగా చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే..కొంతమంది ప్రత్యేకంగా రెడీ అయ్యి ఫోటోషూట్ నిర్వహిస్తుంటే.. మరి కొంతమంది తమ అందంతో ఆకట్టుకునేందుకు గ్లామర్ వలకబోస్తే చాలు ప్రదేశంతో పనిలేదు అని నిరూపిస్తున్నారు. ఇటీవల ఒక హీరోయిన్ ఏకంగా బాత్రూం నుండి కొన్ని ఫోటోలు షేర్ చేస్తే.. ఇప్పుడు మరో హీరోయిన్ ఏకంగా బెడ్ నుండి ఫోటోలు పంచుకోవడం వైరల్ గా మారింది. అందులోనూ నైటీ ధరించి మరీ అందాలు ఆరబోయడంతో ఇది చూసిన నెటిజన్స్ ఇదో ట్రెండీ ఫోటో షూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు అందాల తార శాన్వీ శ్రీ వాస్తవ.
1992 డిసెంబర్ 8న ఉత్తరప్రదేశ్ వారణాసిలో జన్మించిన శాన్వి అసలు పేరు శాంభవి శ్రీ వాత్సవ. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకుంది. ఈమెకు ఒక అన్నయ్య, అక్క కూడా ఉన్నారు. అక్క విదిషా శ్రీ వాత్సవ. ఈమె కూడా ఒక నటే . శాన్వి ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. ముంబైలో ఎంబీఏ పూర్తి చేసింది. 2012లో సాయికుమార్ వారసుడు ఆది సాయికుమార్ హీరోగా నటించిన లవ్లీ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తన రెండవ తెలుగు చిత్రం అడ్డా సినిమాలో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ గా కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక తర్వాత హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన చంద్రలేఖ సినిమాతో కన్నడలో అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత తెలుగులో రౌడీ , ప్యార్ మే పడిపోయానే వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత కన్నడ ,మలయాళం, మరాఠీ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు సడన్గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకుంది.
ఇట్స్ బెడ్డింగ్ టైం అంటూ బెడ్ మీద నుంచే అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దుప్పటిని హత్తుకొని శాన్వి షేర్ చేసిన ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదో ట్రెండీ ఫోటోషూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే శాన్వి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అమ్మడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. మళ్లీ హీరోయిన్గా అవకాశాలు అందుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం కన్నడ, మరాఠీ భాషలలో ఫోకస్ పెట్టిన ఈమె త్వరలోనే తెలుగులో మంచి అవకాశం అందుకొని రీఎంట్రీ ఇవ్వాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు శాన్వీ పాత్రకు తగ్గట్టుగా బలమైన క్యారెక్టర్ ఎవరు ఇస్తారో చూడాలి.
