పిక్‌టాక్ : మతి పోగొట్టే అందంతో ముద్దుగుమ్మ
లవ్లీ సినిమాతో 2012లో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ శాన్వి ఆ సమయంలోనే లవ్లీ బ్యూటీ అనిపించుకుంది.
By: Ramesh Palla | 17 Nov 2025 1:00 PM ISTలవ్లీ సినిమాతో 2012లో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ శాన్వి ఆ సమయంలోనే లవ్లీ బ్యూటీ అనిపించుకుంది. ఆ సమయంలో శాన్వి కచ్చితంగా టాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంటుంది అని అంతా భావించారు. అయితే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రాకపోవడంతో తెలుగులో మీడియం రేంజ్ హీరోయిన్‌గా నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో దశాబ్ద కాలంగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ తెలుగులో కాకున్నా ఇతర భాషల్లో సినిమాల్లో నటించడం ద్వారా శాన్వి ఇండస్ట్రీలో తన యొక్క ఉనికి చాటుకుంటూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం.
శాన్వి హీరోయిన్‌గా ఎంట్రీ...
మలయాళం, కన్నడం, మరాఠి సినిమాల్లోనూ నటించడం ద్వారా శాన్వి ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఇంత అందంగా ఉన్న శాన్వి తెలుగులో సినిమాలు చేయక పోవడం విడ్డూరంగా ఉందని, ఆమెకు ఎందుకు ఆఫర్లు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు చూసిన వారు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పుడు కాకున్నా ఆమె కాస్త గట్టిగా ట్రై చేస్తే తప్పకుండా ముందు ముందు ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శాన్వి ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నాళ్లు అయినా ఇప్పటికీ చాలా అందంగా ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే తాజా ఫోటో షూట్‌తో శాన్వి మతి పోగొడుతోంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు మరోసారి వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌లో లవ్లీ సినిమాతో...
దాదాపుగా 15 లక్షల మంది ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న శాన్వి రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంది. ఈ అమ్మడు తన అందమైన ఫోటోలతో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతుంది. ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందమైన ఫోటోలు షేర్ చేసింది. థైస్ అందాలను చూపిస్తూ శాన్వి ఇచ్చిన ఫోజ్ లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఎవరికి అయినా వయసు పెరుగుతూ ఉంటే అందం తగ్గుతూ ఉంటుంది. కానీ శాన్వి విషయంలో అది రివర్స్ అవుతుందా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. శాన్వి చాలా అందంగా ఉందని, ఆమె యొక్క అందంతో మతి పోగొడుతోంది అంటూ నెటిజన్స్ ఈ ఫోటోలు షేర్ చేస్తూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం, అందుకు తగ్గట్లుగా ఫోటో ఫోజ్‌లు ఇచ్చిన శాన్వి చూపు తిప్పనివ్వడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కన్నడ సినిమా ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జన్మించిన ఈఅమ్మడు కన్నడ సినిమా నటిగా సెటిల్ అయింది. 1993 డిసెంబర్ 8న జన్మించిన శాన్వి చిల్డ్రన్ విద్యను పూర్తి చేసింది. ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. శాన్వి కి అక్క ఉన్నారు. ఆమె పేరు విదిషా. ఆమె కూడా నటి అనే విషయం తెల్సిందే. తెలుగు లో 2012లో బి జయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి శాన్వి పరిచయం అయింది. అంతకు ముందు వరకు మోడల్‌గా శాన్వి కనిపిస్తూ వచ్చింది. ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేస్తూ ఉన్న సమయంలోనే ఈమెకు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది, కానీ స్టార్‌డం మాత్రం కన్నడ సినిమా ఇండస్ట్రీలో దక్కింది. టాలీవుడ్‌లో మంచి సినిమా ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఈమె చెప్పుకొచ్చింది.
