Begin typing your search above and press return to search.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్.. ఆ స్పెషల్ మూమెంట్ చూశారా?

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   22 Jun 2026 10:07 AM IST
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ షణ్ముఖ్.. ఆ స్పెషల్ మూమెంట్ చూశారా?
X

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఈయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది. దీనికి తోడు హౌస్ లోకి వెళ్లకముందే ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయనతో ప్రేమలో పడడం, చెట్టాపట్టాలేసుకొని తిరగడం చూసి ఈ జంటకు అభిమానులు ఫిదా అయిపోయారు. పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్న అభిమానులు కూడా చాలామంది. ఇక అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ.. హౌస్ లో ఉన్నప్పుడు తన స్నేహితురాలు సిరి హనుమంత్ తో సన్నిహితంగా ఉన్న కారణంగా దీప్తి.. షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది. అలా తన వ్యక్తిగత విషయాలతో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న షణ్ముఖ్.. ఇటీవల వైష్ణవి అనే అమ్మాయితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.





దీనికి తోడు పెళ్లి కాకుండానే కాబోయే భార్యతో కొన్ని రోజుల క్రితం గృహప్రవేశం చేయడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ విషయం పై కాస్త క్లారిటీ వచ్చేసింది . తాజాగా వైష్ణవి చోడిశెట్టి మెడలో మూడు ముళ్ళు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పట్టు వస్త్రాలలో లక్ష్మీనారాయణులలా ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.





ఇకపోతే షణ్ముఖ్.. వైష్ణవితో పెళ్లి విషయాన్ని ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ వీరి బెస్ట్ ఫ్రెండ్ సాహిత్య ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





ఇకపోతే సాహిత్య షేర్ చేసిన ఈ పెళ్లి ఫోటోలలో, వీడియోలలో అందరి దృష్టిని ఒక స్పెషల్ మూమెంట్ ఆకట్టుకుంది. జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ముచ్చట్లాడుతున్న సందర్భం అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఇక ఈ స్పెషల్ మూమెంట్ అదరహో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి యూట్యూబర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న షణ్ముఖ్ ఇప్పుడు వైష్ణవినీ పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారయ్యారని చెప్పవచ్చు.





షణ్ముఖ్ విషయానికి వస్తే .. వైవా షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. వైజాగ్ కి చెందిన వారు. యూట్యూబర్ గా తన కెరీర్ను మొదలుపెట్టారు. ఇక వైవా షార్ట్ ఫిలిం తర్వాత పలు తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. అయితే ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్ లో మంచి పాపులారిటీ అందించాయి. పైగా బిగ్ బాస్ షోలో పాల్గొని రన్నరప్ గా కూడా నిలిచారు.