బిగ్ బాస్ షన్ను ఎంగేజ్మెంట్.. ఆ 'V' ఎవరంటే?
అయితే తాజాగా తన లైఫ్ లో కొత్త చాప్టర్ ను మొదలుపెట్టారు. ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో షణ్ముఖ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
By: M Prashanth | 25 Feb 2026 10:22 PM ISTబుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్ను. యూట్యూబ్ కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసులతో స్టార్ డమ్ సంపాదించిన ఆ యంగ్ యాక్టర్.. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఆ సీజన్ లో రన్నరప్ గా నిలిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న షన్ను, గత కొంత కాలంగా వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా తన లైఫ్ లో కొత్త చాప్టర్ ను మొదలుపెట్టారు. ఈ రోజు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో షణ్ముఖ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎవరో అభిమానులకు అధికారికంగా పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. ఆ అమ్మాయి పేరు వైష్ణవి చోడిశెట్టి. ఆమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందిన యువతిగా సమాచారం.
షణ్ముఖ్ జశ్వంత్ లవ్స్ వైష్ణవి చోడిశెట్టి- ఎంగేజ్డ్ అంటూ రాసుకొచ్చి, ఇది దేవుని ప్లాన్ అని షన్ను ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను, సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఫొటోల్లో షన్ను, వైష్ణవి ఇద్దరూ గోల్డెన్ కలర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. షన్ను జంటను చూసిన నెటిజన్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్, క్యూట్ కపుల్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
కొంతకాలంగా తన ప్రేమ గురించి V అనే లెటర్ తో మాత్రమే హింట్ ఇస్తూ వచ్చిన షణ్ముఖ్, ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ తర్వాత మరింత గుర్తింపు పొందారు. అయితే అదే షోలో మరో నటితో స్నేహం, లవ్ ట్రాక్ చుట్టూ జరిగిన చర్చలు వివాదాలకు దారి తీశాయి.
అప్పటికే ఆయన దీప్తి సునయన తో రిలేషన్ లో ఉండటంతో అభిమానులు విమర్శలు గుప్పించారు. చివరకు షో ముగిసిన తర్వాత దీప్తితో బ్రేకప్ కూడా అయింది. దానికి తోడు డ్రగ్స్ కేసు, కుటుంబ సమస్యలు, తల్లి ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాలు షణ్ముఖ్ ను మానసికంగా కుంగదీశాయి. కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిన ఆయన, ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టారు.
ప్రస్తుతం షణ్ముఖ్ హీరోగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఓటీటీలో వచ్చిన లీలా వినోదం మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ప్రేమకు నమస్కారం అనే సినిమా షూటింగ్ లో ఉంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు షన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఏదేమైనా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా కూడా షన్ను కొత్త మార్గంలో అడుగులు వేస్తున్నారనే చెప్పాలి. త్వరలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుండగా.. ఎప్పుడు అనేది వేచి చూడాలి.
