Begin typing your search above and press return to search.

ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న షణ్ముఖ్.. దీపు రియాక్షన్?

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

By:  Madhu Reddy   |   26 Feb 2026 2:47 PM IST
ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న షణ్ముఖ్.. దీపు రియాక్షన్?
X

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో అడుగుపెట్టి రన్నరప్ గా బయటకు వచ్చారు. ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు పర్సనల్గా ఇటు కెరియర్ పరంగా కోలుకోలేని ఎదురు దెబ్బలు తగిలాయి.




ముఖ్యంగా ఆయన హౌస్ లో ఉన్నప్పుడు సిరి హనుమంత్ తో కాస్త చనువుగా కొనసాగడం వల్లే బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రేయసి దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పిన విషయం సంచలనం సృష్టించింది. మళ్ళీ దీప్తి, షణ్ముఖ్ కలిసి పోవాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. కానీ ఈ జంట మళ్ళీ కలవలేదు.

కానీ సడన్గా తన ప్రియురాలికి బర్తడే విషెస్ తెలియజేస్తూ ఆమె ఫేస్ రివీల్ చేయకుండా ఒక పోస్ట్ పెట్టడంతో.. ఇన్నేళ్ల తర్వాత షణ్ముఖ్ మళ్ళీ ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అదే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను తాజాగా షేర్ చేస్తూ తన కాబోయే భార్యని అభిమానులకు పరిచయం చేశారు. ఫ్యామిలీ సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ షణ్ముఖ్ జస్వంత్ లవ్స్ వైష్ణవి చోడిశెట్టి ఎంగేజ్డ్ అని క్యాప్షన్ ఇస్తూ దేవుడి ప్లాన్ రివీల్ అయింది అంటూ క్యాప్షన్ జోడించారు. మొత్తానికైతే ఇన్ని రోజులు అటు వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న షణ్ముఖ్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నారు.

ఎవరీ వైష్ణవి చోడిశెట్టి..

ఇకపోతే షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వగా.. ఈమె కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ అని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా షణ్ముఖ్ షేర్ చేసిన ఫోటోలలో వైష్ణవి, షణ్ముఖ్ పట్టు వస్త్రాలలో చాలా అందంగా మెరిసిపోతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, చాలా క్యూట్ జోడి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

స్పందించని సన్నిహితులు..

అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. అటు బిగ్ బాస్ సన్నిహితులు కానీ షణ్ముఖ్ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరూ కూడా ఈ పోస్ట్ కింద కామెంట్ పెట్టకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే అందరూ కామెంట్లు చేస్తూ ఉంటారు. కానీ షణ్ముఖ్ ఏకంగా కొత్త జీవితంలోకి అడుగుపెడుతూ నిశ్చితార్థ ఫోటోలు పెట్టినా కూడా ఎవరు స్పందించకపోవడంతో అందరూ ఆశ్చర్యం లో మునిగి తేలుతున్నారు. మరి నిశ్చితార్థంతో ఒక్కటి కాబోతున్న ఈ జంట ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

దీప్తి రియాక్షన్?

ఇదిలా ఉండగా మరొకవైపు షణ్ముఖ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో దీప్తి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అసలు దీప్తి ఈ వేడుకపై ఏదైనా స్పందిస్తుందా లేక సైలెంట్ గా ఉండిపోతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.