గురువు తనయుడితో ఛాన్స్ శిష్యుడుకిచ్చాడా?
ఆ తర్వాత మళ్లీ తనయుడి డెబ్యూ విషయంలో ఎలాంటి ప్రచారం కూడా జరగ లేదు. కుమార్తె అదితి శంకర్ హీరో యిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ తనయుడిని మాత్రం హైడ్ చేసారు.
By: Srikanth Kontham | 30 Dec 2025 2:00 PM ISTస్టార్ డైరెక్టర్ శంకర్ తనయుడు అర్జిత్ శంకర్ హీరో అవుతున్నాడు? అన్నది మూడేళ్ల క్రితం నాటి మాట.శంకర్ ఎంతో గ్రాండియర్ గా తనయుడి లాంచింగ్ ప్లాన్ చేసాడని..తానే స్వయంగా నిర్మిస్తున్నట్లు కూడామీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. శంకర్ నిర్మించిన `ప్రేమిస్తే` సినిమా సీక్వెల్ లోనే అర్జిత్ శంకర్ నటిస్తా డని వార్తలొచ్చాయి. డాడ్ కేవలం నిర్మాతగా మాత్రమే కొనసాగుతారని. .డైరెక్షన్ అన్నది మరొకరకి అప్పగించారని ప్రచారంలోకి వచ్చింది. కానీ ఎందుకనో అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఆ తర్వాత మళ్లీ తనయుడి డెబ్యూ విషయంలో ఎలాంటి ప్రచారం కూడా జరగ లేదు. కుమార్తె అదితి శంకర్ హీరో యిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ తనయుడిని మాత్రం హైడ్ చేసారు. తాజాగా మళ్లీ అర్జిత్ శంకర్ ఎంట్రీ విషయం లో ప్రచారం పతాక స్థాయికి చేరింది. 2026 లో అర్జిత్ ఎంట్రీ ఖరారైనట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ బాధ్యతలు మురగదాస్, అట్లీ వద్ద శిష్యరికం చేసిన ఓ కొత్త కుర్రాడికి అప్పగించినట్లు వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ కూడా ఫిక్సైదంటున్నారు. తొలుత మలయాళం నటి మమితా బైజును ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి.
కానీ తాజాగా ఆ పాత్రకు `ఉప్పెన` ఫేం కృతి శెట్టిని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ని దించే ప్రయత్నాలు చేస్తున్నారుట. మొత్తానికి కోలీవుడ్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం చూస్తుంటే? ప్రాజెక్ట్ లాక్ అయినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే అర్జిత్ శంకర్ యాక్టింగ్, డాన్స్, యాక్షన్ కి సంబంధించి ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇంట్లోనే శంకర్ అనే గొప్ప గురువు ప్రోత్సాహం ఎలాగూ ఉంటుంది. ఆయన నుంచి స్పెషల్ ట్రైనింగ్ తప్పనిసరి. కాబట్టి ఆ విషయంలో శంకర్ ఎక్కడా రాజీ పడరు. బేసిక్ ట్రైనింగ్ బయట ఇప్పించినా? ఇంట్లో స్పెషల్ క్లాస్ లు తప్పని సరి.
మరి అర్జిత్ ఎలాంటి కథలో కనిపిస్తాడు? అన్నది చూడాలి. `ప్రేమిస్తే` సీక్వెల్ కి అయితే ఛాన్సెస్ ఉండవు. లవ్ స్టోరీల తో పాటు, సినిమా ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇన్నోవేటివ్ స్టోరీలకే ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. మరి తనయుడి విషయంలో శంకర్ క్రియేటివ్ పార్ట్ లో ఎంత వరకూ ఛాన్స్ తీసుకుం టారో చూడాలి. కొంత కాలంగా శంకర్ సినిమాలు కూడా డిజాస్టర్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో మేకర్ గా ఆయన స్పీడ్ కూడా తగ్గింది. మునుపటంత క్రేజ్ శంకర్ సినిమాలకు కనిపించడం లేదు. అన్నట్లు అట్లీ కూడా శంకర్ శిష్యుడే అన్న సంగతి తెలిసిందే. శంకర్ వద్ద పనిచేసే డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అట్లీ శిష్యుడు గురువు తనయుడిని లాంచ్ చేయడం ఇంట్రెస్టింగ్.
