Begin typing your search above and press return to search.

షేన్ నిగమ్ తెలుగు డెబ్యూ.. గ్లింప్స్‌తోనే షాక్!

మలయాళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరో షేన్ నిగ‌మ్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 March 2026 11:13 AM IST
షేన్ నిగమ్ తెలుగు డెబ్యూ.. గ్లింప్స్‌తోనే షాక్!
X

మలయాళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరో షేన్ నిగ‌మ్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌తో ఆయన తెలుగు ప్రేక్షకులను నేరుగా ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాను యువ దర్శకుడు సాగ‌ర్ ఉడ‌గండ్ల‌ తెరకెక్కిస్తుండగా, మాదేవ్ మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మాత సురేష్ కుమార్ నిర్మిస్తున్నారు.

#షేన్27 గ్లింప్స్ రిలీజ్

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేక‌ర్స్ రీసెంట్ గా రిలీజ్ చేయ‌గా, అది ప్రేక్షకుల్లో వెంటనే ఆసక్తిని రేకెత్తించింది. స్టైలిష్‌గా కారులోనుంచి దిగే హీరో, కూల్‌గా బీర్ బాటిల్ ఓపెన్ చేయడం, సిగరెట్ వెలిగించుకుని ధైర్యంగా ముందుకు సాగిపోవడం లాంటి షాట్స్.. మొత్తం గ్లింప్స్‌కి ఒక మాస్, అటిట్యూడ్ టోన్‌ను తీసుకొచ్చాయి. ఈ చిన్న వీడియో ద్వారానే సినిమా మొత్తం ఎంత రఫ్ మ‌రియు ఇంటెన్స్‌గా ఉండబోతోందో క్లియర్‌గా అర్థమవుతోంది.

మాస్ క్యారెక్ట‌ర్ లో షేన్

ఈ సినిమాలో షేన్ నిగ‌మ్ ఓ కొత్త అవతారంలో కనిపించబోతున్నార‌ని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మలయాళంలో చేసిన సినిమాల్లో అతను చూపించిన ఎమోష‌న‌ల్ యాక్టింగ్ తోడు, ఈ సినిమాలో రగ్డ్, స్ట్రీట్ లెవెల్ మాస్ క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నారు. యాక్షన్ ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ డైరెక్ట‌ర్ ఈ కథను రెడీ చేసుకున్నార‌ని సమాచారం.

తెలుగు ఆడియ‌న్స్ లో షేన్ కు మంచి క్రేజ్

ఆల్రెడీ కుంబ‌లంగి నైట్స్, RDX, భూత‌కాలం, ఇష్క్ లాంటి హిట్ సినిమాల‌తో షేన్ నిగ‌మ్ తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా అతని సినిమాలు చూసిన తెలుగు ఆడియన్స్‌లో షేన్ నిగ‌మ్ కు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే అతని డైరెక్ట్ తెలుగు డెబ్యూ మీద సహజంగానే అంచనాలు పెరిగాయి.

మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్

సామ్ సిఎస్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తుండ‌గా, ఆయన గతంలో చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు సినిమాలకు పెద్ద ప్లస్ అయ్యాయి. ద్వార‌కేష్, అబూర్వ‌న్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విజువల్‌గా కూడా సినిమా స్టైలిష్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథలో బలమైన ఎమోషన్స్, ఫైట్స్, మరియు రియలిస్టిక్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని సమాచారం. తర్వలోనే ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మొత్తానికి, మలయాళ స్టార్ షేన్ నిగ‌మ్ టాలీవుడ్ ఎంట్రీతో మరో కొత్త మాస్ హీరోను తెలుగు ఇండస్ట్రీ స్వాగతించబోతున్నట్టే కనిపిస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో మరింత పెరిగింది.