Begin typing your search above and press return to search.

మినీ డ్రెస్ లో చెమటలు పట్టిస్తున్న షనయా కపూర్..

మోడ్రన్ అండ్ పాప్ గ్లామ్ లుక్‌లో ఆమె ఫిజిక్, స్టైలింగ్ అదిరిపోయాయని ఫ్యాషన్ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   3 Feb 2026 5:00 PM IST
మినీ డ్రెస్ లో చెమటలు పట్టిస్తున్న షనయా కపూర్..
X

బాలీవుడ్ స్టార్ కిడ్ షనయా కపూర్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. సంజయ్ కపూర్ తనయగా కంటే, తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాషన్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, తాజాగా గ్రీన్ మినీ డ్రెస్‌లో మెరిసి నెటిజన్ల కళ్లు తిప్పుకోకుండా చేస్తోంది. గ్లామర్, కాన్ఫిడెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన షనయా, తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌లో హీట్ పెంచుతోంది. ఆమె సినీ ప్రయాణం , తాజా గ్లామర్ పిక్స్ విశేషాలు మీకోసం.

గ్రీన్ మినీ డ్రెస్‌లో షనయా గ్లామర్ విందు:

షనయా కపూర్ తాజాగా పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రీన్ కలర్ మినీ డ్రెస్‌లో ఆమె చూపిస్తున్న గ్లామర్ మ్యాజిక్ నెటిజన్లకు ‘చెమటలు పట్టిస్తోంది’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మోడ్రన్ అండ్ పాప్ గ్లామ్ లుక్‌లో ఆమె ఫిజిక్, స్టైలింగ్ అదిరిపోయాయని ఫ్యాషన్ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ సోదరీమణుల బాటలోనే షనయా కూడా తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో యూత్ ఐకాన్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు ఈ భామ పిక్స్ ను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.

సినీ ఎంట్రీ:

షనయా కపూర్ తన కెరీర్‌ను జాన్వీ కపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి, సినిమా మేకింగ్‌పై పట్టు సాధించింది. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ ఫాంటసీ డ్రామా "వృషభ" ద్వారా వెండితెరకు పరిచయమైంది. డిసెంబర్ 2025లో విడుదలైన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, గత జన్మల నేపథ్యంలో రూపొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మిశ్రమ సమీక్షలు మరియు ప్రతికూల వసూళ్లతో ఈ సినిమా షనయా ఎంట్రీకి గట్టి పునాది వేయలేకపోయింది.

భవిష్యత్తు ప్రణాళికలు:

ఇక షనయా కపూర్, విక్రాంత్ మాస్సే కలిసి నటించిన మూవీ ఆంఖోన్ కి గుస్తాఖియాన్ మూవీ 2025 లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ సక్సెస్ ను అందుకుంది. ఇక అప్‌కమింగ్ హీరోయిన్లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న భామగా ఆమె పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబై, యూరప్ వంటి ప్రాంతాల్లో షూటింగ్స్ ముగించుకుని మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కమర్షియల్ సక్సెస్ లభించినా లభించకపోయినా, తన గ్లామర్ , నటనతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు షనయా సిద్ధమవుతోంది. మరి రాబోయే చిత్రాలతో ఈ బ్యూటీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి..