ఇంకా వీళ్లు ఆయన్నే నమ్ముతున్నారేంటో..?
ఆయన బ్యానర్‌లో పరిచయం అయిన వారు ప్రస్తుతం బాలీవుడ్‌లో చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన టైం నడవడం లేదు, ఆయన సినిమాలు జనాల్లో గతంలో మాదిరిగా ఆడటం లేదు.
By: Ramesh Palla | 5 Sept 2025 6:00 AM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోలు తమ వారసులను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా పరిచయం చేస్తే బాగుంటుంది అనుకునే వారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో చాలా మంది స్టార్ హీరోలు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పరిచయం అయిన విషయం తెల్సిందే. మొన్నటి వరకు కూడా హీరోలను పరిచయం చేస్తూ రాఘవేంద్ర రావు తన స్టార్‌డం కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆ స్థానంను మరెవ్వరూ భర్తీ చేయలేరు అనడంలో సందేహం లేదు. రాఘవేంద్ర రావు తరహాలోనే బాలీవుడ్‌లో కరణ్ జోహార్ సైతం ఎంతో మంది స్టార్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన బ్యానర్‌లో పరిచయం అయిన వారు ప్రస్తుతం బాలీవుడ్‌లో చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన టైం నడవడం లేదు, ఆయన సినిమాలు జనాల్లో గతంలో మాదిరిగా ఆడటం లేదు.
జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ పరిచయం..
బాలీవుడ్‌కి చెందిన స్టార్స్ ఎంతో మంది తమ వారసులను ఇండస్ట్రీలో పరిచయం చేయడం కోసం కరణ్ జోహార్‌ను సంప్రదించారు, ఇప్పటికీ ఆయన వద్దకే ఎంతో మంది స్టార్ కిడ్స్‌ను పంపిస్తూ ఉంటారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్స్‌గా మంచి గుర్తింపు దక్కించుకుని వరుస సినిమాలు చేస్తున్న వారిలో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్య పాండే, కియారా అద్వానీ, తారా సుతారియా, త్రిప్తి డిమ్రిలు ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్ర, ఇషాన్ ఖట్టర్, గుర్‌ఫతే పిర్జాదా, లక్ష్య లల్వానీ ఎంతో మంది స్టార్స్‌కి కరణ్ జోహార్ బ్రేక్ ఇచ్చాడు. చాలా మంది నటీ నటులు కరణ్ జోహార్ బ్యానర్ లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు ఉన్నారు. అందుకే ఇప్పటికీ ఆయన ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ లో నటించాలని అనుకుంటారు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3 సినిమాతో షనాయ కపూర్
కపూర్ ఫ్యామిలీ నుంచి మరో ముద్దుగుమ్మను కరణ్ జోహార్ బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన సూపర్ హిట్ ప్రాంచైజీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3 సినిమాలో సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కరణ్ జోహార్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం ఉంటుంది అనే ఒక నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రాంచైజీ సినిమాతో షనయా కపూర్ కచ్చితంగా మంచి గుర్తింపును దక్కించుకోవడం మాత్రమే కాకుండా హీరోయిన్‌గా ఆమెకు ఒక బిగ్ బ్రేక్ లభిస్తుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే షనాయా కపూర్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే హీరోయిన్‌గా మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఖచ్చితంగా భారీ బ్రేక్ దక్కే అవకాశం ఉంది.
బాలీవుడ్‌లో బిగ్ మూవీగా
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3 సినిమాలో షనాయ పాత్ర గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా గురించి డ్యూయెల్ రోల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా షనాయ కపూర్ నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటి వరకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లుగా మెప్పించాయి. అందుకే ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు షనాయా కపూర్‌కి బిగ్ బ్రేక్ ఇచ్చి, బాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కపూర్ ఫ్యామిలీ నమ్మకంగా ఉంది. అయితే ధర్మ ప్రొడక్షన్స్ లో వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా ఇంకా ఈ స్టార్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎలా కరణ్ జోహార్ పై నమ్మకం కలిగి ఉన్నారో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
