బీటౌన్ బ్యూటీస్.. ఇద్దరూ సేమ్ ప్లాన్?
బాలీవుడ్ స్టార్ కిడ్స్, యంగ్ బ్యూటీస్ షనయా కపూర్, అనన్య పాండే మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 17 Feb 2026 9:00 PM ISTబాలీవుడ్ స్టార్ కిడ్స్, యంగ్ బ్యూటీస్ షనయా కపూర్, అనన్య పాండే మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఆ ఇద్దరూ కేవలం ఫ్రెండ్స్ గానే కాదు.. ఒకరిని ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ లా భావిస్తారు. ఇప్పుడు అదే బాండింగ్ వారి కెరీర్ లో కూడా కనిపిస్తోంది. ఇద్దరూ ఒకే తరహా పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
షనయా, అనన్య, సుహానా ఖాన్.. ముగ్గురూ చిన్ననాటి ఫ్రెండ్స్. ఆ ముగ్గురిని అభిమానులు ప్రేమగా చార్లీస్ ఏంజెల్స్ అని పిలుస్తుంటారు. స్కూల్ డేస్ నుంచే కలిసి గడిపిన వీరు ఇప్పటికీ అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అనన్య ఇప్పటికే బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె నటించిన కాల్ మీ బే, CTRL ప్రాజెక్టుల్లో హై క్లాస్ సౌత్ బాంబే ఇన్ఫ్లుయెన్సర్ పాత్రల్లో కనిపించి మంచి ప్రశంసలు అందుకుంది.
స్టైలిష్, మోడ్రన్ క్యారెక్టర్లకు అనన్య పర్ఫెక్ట్ గా సూటవుతుందనే కామెంట్లు వచ్చాయి. ఇక షనయా కూడా తాజాగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన తూ యా మైన్ చిత్రంలో మిస్ వానిటీ పాత్రలో కనిపించింది. ఆ రోల్ కూడా సౌత్ బాంబే ఇన్ఫ్లుయెన్సర్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండటం విశేషం. పాత్రకు తగ్గట్టు ఆమె చూపించిన కాన్ఫిడెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దీనికి ముందు వచ్చిన ఆంకూన్ కి గుస్తాఖియాన్ సినిమాలో ఆమె యాక్టింగ్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రాగా, తాజా చిత్రంతో ఆ విమర్శలకు చెక్ పెట్టిందని అంతా చెబుతున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే… షనయా సినిమాలకు అనన్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తోంది. స్నేహితురాలి ప్రతి ప్రాజెక్ట్ ప్రమోట్ చేస్తూ ఆమెకు అండగా నిలుస్తోంది. అలాగే షనయా కూడా అనన్య సక్సెస్ లను సెలబ్రేట్ చేస్తోంది.
ఒకే ఫీల్డ్ లో ఉన్నా పోటీ ఫీలింగ్ లేకుండా ఒకరి డెవలప్మెంట్ కు ఒకరు తోడ్పడటం ప్రత్యేకతగా మారింది. ఇప్పుడు సినిమాపై కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, థ్రిల్లర్ డ్రామా ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా షనయా యాక్టింగ్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాతో పోలిస్తే ఈసారి ఆమె మరింత కాన్ఫిడెంట్ గా కనిపించిందని ప్రేక్షకులు చెబుతున్నారు.
ఏదేమైనా బాలీవుడ్ లో చార్లీస్ ఏంజెల్స్ గా పేరొందిన ఫ్రెండ్స్ ఒకే లాంటి ప్లాన్ తో ఇప్పుడు నటనలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఫ్రెండ్ షిప్, సపోర్ట్, టాలెంట్.. కలిస్తే సక్సెస్ ఖాయం అని షనయా– అనన్య మరోసారి నిరూపిస్తున్నారనే చెప్పాలి. మరి చూడాలి వారి అప్ కమింగ్ చిత్రాలు ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాయో.
