Begin typing your search above and press return to search.

ఇంకా ప్రేమ‌లో ప‌డ‌లేద‌న్న స్టార్ కిడ్

ఇటీవ‌లే త‌న 21వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న స‌న‌యా క‌పూర్ త‌న కెరీర్ జ‌ర్నీలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించింది.

By:  Sivaji Kontham   |   4 Nov 2025 11:00 PM IST
ఇంకా ప్రేమ‌లో ప‌డ‌లేద‌న్న స్టార్ కిడ్
X

బాలీవుడ్ లో వ‌రుస‌గా న‌ట‌వార‌సురాళ్లు వెండితెర‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ న‌టుడు సంజ‌య్ క‌పూర్ కుమార్తె స‌న‌య క‌పూర్ కూడా ఈ ఏడాది క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. ఇటీవ‌లే త‌న 21వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న స‌న‌యా క‌పూర్ త‌న కెరీర్ జ‌ర్నీలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించింది.

ఈ యంగ్ బ్యూటీ న‌టించింది ఒక సినిమానే అయినా కానీ, అనుభ‌వాల‌లో చాలా సీనియారిటీని సొంతం చేసుకున్నాన‌ని తెలిపింది. 20 వ‌య‌సులోనే ఎన్నో అనుభ‌వాలు. త‌న మొద‌టి సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఆగిపోయింది. ఆ త‌ర్వాత కూడా రెండో సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఇక మూడో సినిమా కొన్ని షాట్లు తెర‌కెక్కించాక ఆగిపోయింది. ఆ త‌ర్వాత ఎన్నో సందిగ్ధ‌త‌ల న‌డుమ త‌న మొద‌టి చిత్రం `ఆంఖోన్ కి గుస్తాకియాన్` (జూలై లో) విడుద‌లైంద‌ని స‌న‌యా త‌న ఆరంభ క‌ష్టాల గురించి గుర్తు చేసుకుంది.

స‌న‌య నటించిన మొద‌టి సినిమా విడుద‌ల‌వ్వ‌డం త‌న‌లో అంతులేని ఆనందం నింపింది. అంత‌కుముందు క‌ష్టాల‌న్నిటినీ మ‌రిపించింది. ఇంత‌కుముందు త‌న స్నేహితురాళ్లు త‌నను బ‌ర్త్ డే పార్టీ ఇవ్వాల‌ని అడిగేవారు. అయితే త‌న మొద‌టి సినిమా విడుద‌ల‌య్యాకే పార్టీ ఇస్తాన‌ని చెప్పేద‌ట‌. ఎట్ట‌కేలకు విడుద‌లైంది గ‌నుక బ‌ర్త్ డే పార్టీని గాళ్స్ కోసం గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసాను అని తెలిపింది స‌నాయ‌. అలాగే త‌న కెరీర్ జ‌ర్నీలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రితోను ప్రేమ‌లో ప‌డ‌లేద‌ని కూడా సాన‌య వెల్ల‌డించింది.

సాన‌య బర్త్ డే పార్టీలో త‌న గాళ్స్ గ్యాంగ్ తో పాటు ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి కూడా సంద‌డి చేసాడు. అయితే పిల‌వ‌ని పేరంటానికి వ‌చ్చాన‌ని అత‌డు ఫీల‌వుతూ సాన‌యాకు ఒక సుదీర్ఘ‌మైన లేఖ కూడా రాసాడు. ఇందులో ప్రేమ విర‌హం వ్యంగ్యంతో చ‌లోక్తులు విసిరాడు.

ఈ ఇంట‌ర్వ్యూలో సాన‌యా త‌న తండ్రి ముఖంపై చెర‌గని చిరు న‌వ్వు గురించి కూడా మాట్లాడింది. ఆయ‌న త‌న కెరీర్ లో ఎన్నిటినో ఎదుర్కొన్నా ముఖంపై చిరున‌వ్వును త‌ర‌గ‌నివ్వ‌లేద‌ని కూడా స‌నాయ తెలిపింది. త‌న తండ్రి నుంచి తాను స్ఫూర్తి పొందుతాన‌ని వెల్ల‌డించింది. అందాల సాన‌య టాలీవుడ్ వైపు ఓ చూపు చూస్తోంది. త‌న స్నేహితురాలు జాన్వీ క‌పూర్ లా ఇరుగు పొరుగు భాష‌ల‌కు దూసుకెళ్లాల‌ని భావిస్తోంద‌ట‌.