Begin typing your search above and press return to search.

ఒంట‌రిత‌నం వృద్ధాప్యంపై నెటిజ‌న్ కామెంట్.. న‌టి రివ‌ర్స్ పంచ్!

కాలంతో పాటు వయసు పెరగడం.. శరీరంలో మార్పులు రావడం అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు! అని స్పష్టం చేశారు.

By:  Sivaji Kontham   |   29 May 2026 5:00 AM IST
ఒంట‌రిత‌నం వృద్ధాప్యంపై నెటిజ‌న్ కామెంట్.. న‌టి రివ‌ర్స్ పంచ్!
X

సెలబ్రిటీల వయసు, రూపం, వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేసే అనుచిత వ్యాఖ్యలు.. బాడీ షేమింగ్ ట్రోల్స్ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయాయి. గతంలో మలైకా అరోరా, కరీనా కపూర్ ఖాన్ లేదా దక్షిణాది నటి నదియా వంటి ప్రముఖ నటీమణులు కూడా ``వృద్ధాప్యం వచ్చేసింది`` అనే కామెంట్లు ఎదుర్కొన్నవారే. అయితే వారంతా సామాజిక మాధ్యమాల వేదికగా తమదైన శైలిలో సమాధానమిచ్చి 50 ప్లస్ వయసులోనూ ఏజ్ లెస్ బ్యూటీస్ గా తామేంటో నిరూపించే ప్రయత్నం చేశారు. తాజాగా బాలీవుడ్ నటి షమితా శెట్టికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవడంతో ఈ న‌టి నెగటివ్ కామెంట్‌కు సోషల్ మీడియా వేదికగానే గట్టి బుద్ధి చెప్పారు. ``నువ్వు గతంలో లాగా అందంగా లేవు.. ముసలితనం వచ్చేస్తోంది`` అంటూ ఒక నెటిజ‌న్ చేసిన కామెంట్‌ను లైట్ తీసుకోకుండా అత్యంత హుందాగా, అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

వయసు పెరగడం అనే ప్రక్రియపై స్పందిస్తూ షమితా శెట్టి ప్రకృతి నియమాలను గుర్తుచేశారు. కాలంతో పాటు వయసు పెరగడం.. శరీరంలో మార్పులు రావడం అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు! అని స్పష్టం చేశారు. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత ఆరోగ్యం.. శారీరక దృఢత్వం ముఖ్యమని నమ్మే ఈ సీనియర్ న‌టి ``ప్రస్తుతం నేను చాలా హెల్తీగా, ఫిట్‌గా ఉన్నాను. నాకు ఆ ఒక్కటి చాలు. వేరే వాళ్ల సర్టిఫికెట్లు అవసరం లేదు`` అంటూ తన లైఫ్ స్టైల్ గురించి గట్టిగా చాటిచెప్పారు.

అయితే సదరు నెటిజన్ అంతటితో ఆగకుండా ష‌మితా వ్యక్తిగత జీవితాన్ని.. వైవాహిక స్థితిని ప్రస్తావిస్తూ మరో వివాదాస్పద కామెంట్ చేశాడు. ``నువ్వు గనుక సరైన సమయానికి పెళ్లి చేసుకొని ఉంటే.. ఈపాటికే నీ పిల్లలు కూడా నీ అంత ఎత్తుకు ఎదిగేవారు`` అంటూ ఉచిత సలహా పారేశాడు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను, పెళ్లి నిర్ణయాలను ప్రశ్నించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ష‌మితా శెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఒంటరిగా, సింగిల్‌గా ఉండే మహిళలపై చూపే ఇలాంటి న్యారో- పాతకాలపు ధోరణిని తీవ్రంగా తప్పుపట్టారు.

ఈ పెళ్లి కామెంట్‌కు షమితా శెట్టి ఇచ్చిన రిటన్ గిఫ్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు పెళ్లిళ్లు చేసుకొని మీరేం సాధించారని ఇతరులకు సలహాలు ఇస్తున్నారు? అంతగా పెళ్లి చేసుకుని సంసారాల్లో బిజీగా ఉన్నప్పుడు.. సింగిల్స్‌గా హ్యాపీగా ఉన్న మమ్మల్ని సోషల్ మీడియాలో ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటూ సదరు నెటిజన్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చి నోరు నొక్కేశారు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి.. వ్యక్తిగత నిర్ణయాల్లోకి తొంగిచూసే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పిన షమితా శెట్టి వ్యాఖ్యలకు తోటి సెలబ్రిటీలు, నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమకు నచ్చినట్టు... ఫిట్‌గా బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. ఆన్‌లైన్ వేదికగా విషాన్ని చిమ్మే వారికి ఇలాంటి కౌంటర్లు పడాల్సిందేనని ష‌మితా ఫాలోవ‌ర్స్ అభిప్రాయపడుతున్నాయి.