Begin typing your search above and press return to search.

లెగసీతో కలిసిన లెజెండ్.. ఆది 'శంబాల' స్పెషల్ స్కెచ్

సాయికుమార్ ఎంట్రీతో ఆ వైబ్ మొత్తం మారిపోయింది.అసలు ఈ ప్రమోషనల్ వీడియోలో హైలైట్ అంటే సాయికుమార్ గారి ఎనర్జీనే.

By:  M Prashanth   |   12 Dec 2025 10:32 PM IST
లెగసీతో కలిసిన లెజెండ్.. ఆది శంబాల స్పెషల్ స్కెచ్
X

యంగ్ హీరో ఆది సాయికుమార్ ఎప్పుడూ రొటీన్ కి భిన్నంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ 'శంబాల'. ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే ఏదో కొత్త ప్రపంచాన్ని చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. అయితే సినిమా ప్రమోషన్స్ ను కేవలం పోస్టర్లకే పరిమితం చేయకుండా, చాలా కొత్తగా ప్లాన్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. 'లెగసీ మీట్స్ లెజెండ్' అనే కాన్సెప్ట్. ఆది సాయికుమార్ ఫ్యామిలీ, డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు 'శంబాల' మూవీ టీమ్ తో కలిసి ఒక ఫన్ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. డిసెంబర్ 13న ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో రానుందట. ఇక ఈ ప్రోమోలో కొన్ని మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక బోటులో ప్రయాణిస్తూ.. చాలా క్యాజువల్ గా, సరదాగా సాగిన ఈ చిట్ చాట్ లో సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

సాయికుమార్ ఎంట్రీతో ఆ వైబ్ మొత్తం మారిపోయింది.అసలు ఈ ప్రమోషనల్ వీడియోలో హైలైట్ అంటే సాయికుమార్ గారి ఎనర్జీనే. ఆయన తనదైన బేస్ వాయిస్ తో పాపులర్ డైలాగులు చెబుతూ, శంబాల టీమ్ ని ఉత్సాహపరిచారు. ఆదికి ఇదికి మైల్ స్టోన్ సినిమా కావడంతో, ఆ రికార్డ్ గురించి సాయికుమార్ మాట్లాడిన విధానం చాలా బాగుంది. ఒక తండ్రిగా కొడుకు సినిమాను సపోర్ట్ చేస్తూనే, తన అనుభవాన్ని జోడించి ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

ఇదే చిట్ చాట్ లో సినిమా అసలు సోల్ గురించి కూడా ఒక హింట్ ఇచ్చారు. సైన్స్ కు, శాస్త్రానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా అని డైరెక్టర్ చెప్పారు. 'శంబాల' అనే మిస్టికల్ ప్లేస్ లో ఒక ఉల్క పడటం, దాని చుట్టూ ఈ కథ నడవడం అనేది క్యూరియాసిటీని పెంచుతోంది. సాయికుమార్ గారు సరదాగా "కల్కి వైబ్స్ ఉన్నాయా?" అని అడగడం, దానికి ఆది ఇచ్చిన రియాక్షన్ సినిమా స్కేల్ ను కళ్ళకు కట్టాయి.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై యుగంధర్ ముని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియోలో నిర్మాతలు రాజశేఖర్, మహీధర్ రెడ్డిలతో పాటు హీరోయిన్ కూడా పాల్గొని సందడి చేశారు. టీమ్ మొత్తం సినిమా అవుట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా 'శంబాల' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది..