Begin typing your search above and press return to search.

ప్రభాస్ చేతులతో 'శంబాల' ట్రైలర్.. విజువల్స్ నెక్స్ట్ లెవెల్..!

శంబాల కథ గురించి చెప్పుకుంటే వేల సంవత్సరాల క్రితం రాక్షసుడితో శివుడు యుద్ధం చేస్తున్న టైంలో శివుని చెమట చుక్క భూమి మీద పడుతుంది.

By:  Ramesh Boddu   |   1 Nov 2025 11:30 AM IST
ప్రభాస్ చేతులతో శంబాల ట్రైలర్.. విజువల్స్ నెక్స్ట్ లెవెల్..!
X

ఆది సాయి కుమార్ హీరోగా ఉగంధర్ ముని డైరెక్షన్ లో వస్తున్న సూపర్ న్యాచురల్ సినిమా శంబాల. ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ లో రాజశేఖర్ అన్నభిమోజు, మహిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో ఆది సాయి కుమార్ తో అర్చన అయ్యార్ స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా శ్వాసిక, రవి వర్మ, మధునందన్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. టీజర్ తోనే సినిమాపై బజ్ పెరిగేలా చేసుకున్న శంబాల టీం లేటెస్ట్ గా ట్రైలర్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ఈ ట్రైలర్ ని రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

మిస్టరీని చేధించేందుకు జియో సైంటిస్ట్..

శంబాల కథ గురించి చెప్పుకుంటే వేల సంవత్సరాల క్రితం రాక్షసుడితో శివుడు యుద్ధం చేస్తున్న టైంలో శివుని చెమట చుక్క భూమి మీద పడుతుంది. అది ఒక ఊరిలో ఉండగా దాని చుట్టూ కొన్ని శక్తులు ఆవహించి ఊరి ప్రజలను బలి తీసుకుంటాయి. ఐతే ఈ మిస్టరీని చేధించేందుకు జియో సైంటిస్ట్ అయిన హీరో రంగంలోకి దిగుతాడు. ఊళ్లో వరుస హత్యలకు కారణం ఎవరు.. ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కి రీజన్ ఏంటి.

దైవం నమ్మని హీరో ఊళ్లో జరిగే పరిణామాలను ఎలా సాల్వ్ చేశాడు అన్నది శంబాల కథ. ట్రైలర్ లోనే చెప్పాలనుకున్న కథ ఏంటన్నది చూపించారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. ఆది సాయి కుమార్ రోల్ ఇంటెన్సివ్ గా బాగా చేశాడనిపిస్తుంది. ఇక సినిమాలో కెమెరా వర్క్, ఇంకా విజువల్స్ ఆడియన్స్ కి మంచి థ్రిల్ కలిగించేలా ఉన్నాయి.

ఈమధ్య సినిమాల్లో డివోషనల్ టచ్..

ఈమధ్య సినిమాల్లో డివోషనల్ టచ్ ఎక్కువ ఉంటుంది. ఐతే వాటిని పర్ఫెక్ట్ గా చూపిస్తే మాత్రం ఆడియన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. శంబాల కథ మొత్తం ట్రైలర్ లో చెప్పిన స్క్రీన్ ప్లే, ఇంకా విజువల్స్ ఇంకా ట్విస్ట్ లతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తారని అనిపిస్తుంది. డైరెక్టర్ తో పాటు మిగతా టెక్నికల్ టీం కూడా సినిమాకు బాగా సపోర్ట్ అందిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఆది సాయి కుమార్ శంబాల ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్ కి ఇది మంచి బ్రేక్ ఇచ్చేలా ఉంది. శంబాల సినిమాను డిసెంబర్ 25 క్రిస్మస్ రేసులో రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా ఆది సాయికుమార్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.