సంక్రాంతికి ముందు క్రిస్మస్ ఛాంపియన్ అయ్యేది ఎవరు..?
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి.. శంభాల.. ఛాంపియన్ సినిమాలు బాక్సాఫీస్ పోటీలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 17 Dec 2025 1:09 PM ISTప్రతి సంవత్సరం లాగానే ఈ సంక్రాంతికి కూడా.. భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి. అయితే అంతకన్నా ముందు..ఈ క్రిస్మస్ వారం... మీడియం బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీపడనున్నాయి.
ప్రస్తుతం అఖండ 2..మినహా సంక్రాంతి వరకు పెద్ద స్టార్ హీరో సినిమా లేకపోవడంతో మిడ్ బడ్జెట్ సినిమాలకు మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి.. శంభాల.. ఛాంపియన్ సినిమాలు బాక్సాఫీస్ పోటీలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ముందుగా శంభాల విషయానికి వస్తే..ఈ సినిమా హీరో ఆది సాయికుమార్‌కు చాలా కీలకం. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో..ఈ సినిమా ఆయనకు కమ్‌బ్యాక్‌గా మారుతుందనే ఆశలు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమా కథ బలంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయట. ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కంటెంట్ కనెక్ట్ అయితే.. శంభాల బాక్సాఫీస్ దగ్గర సర్ప్రైజ్ ఇవ్వొచ్చని పలువురు భావిస్తున్నారు.
ఇక మరోవైపు ఛాంపియన్ సినిమా కూడా మంచి బజ్ తెచ్చుకుంది. రోషన్ మేకా హీరోగా.. నటించిన ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన.. గిరగిర.. పాట సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ పాటలో హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండటంతో..ఈ హాలిడే సీజన్‌లో క్లిక్ అవ్వడానికి.. ఈ సినిమాకు మంచి అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు పంచదార వేస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాతో శ్రీకాంత్ కొడుకు కూడా తన ఎంతో రుజువు.. చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు.
మరోపక్క శంభాల, ఛాంపియన్‌తో పాటు ఈషా, అన్నగారు వస్తారు, దండోరా, మార్క్, వృషభ, పఠాన్, వానర వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కాగా.. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు.
మొత్తానికి డిసెంబర్ చివరి వారంలో దాదాపు ఎనిమిది సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. చివరికి ఏ సినిమా గెలుస్తుందో వేచి చూడాలి. సంక్రాంతి పెద్ద సినిమాల రాకముందు..ఈ క్రిస్మస్ సీజన్‌లో తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ కనిపించబోతోంది.
