పిక్‌టాక్ : రెడ్ సారీలో మరింత అందంగా..!
సౌత్ ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.
By: Ramesh Palla | 7 Dec 2025 12:00 AM ISTసౌత్ ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన షామా సికిందర్ ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది, దారుణమైన ఫ్లాప్స్ ను చవిచూసింది. ముఖ్యంగా ఈమె బుల్లి తెరపై స్టార్‌డంను దక్కించుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా ఈమెను చూసి ఎంతో మంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. బుల్లి తెర నుంచి వెండి తెరపై ఈమె ప్రయాణం సాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకుల్లోనూ గుర్తింపు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది.
షామా సికిందర్ సోషల్ మీడియా ఫాలోయింగ్...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న షామా సికిందర్ ఎప్పటికప్పుడు తన కొత్త అందమైన ఫోటోలను షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఈమె ఫోటోలు చూసిన చాలా మంది సోషల్ మీడియాలో ఇంత అందంగా ఉన్నారు ఎందుకు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకోలేక పోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన అందమైన రూపంతో పాటు పాటు, తన విభిన్నమైన ఔట్ ఫిట్ కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందమైన ఫోటోల కారణంగా వార్తల్లో నిలిచింది. ఇందుకే షామా సికిందర్ అందగత్తె అనే విధంగా అందంగా ఫోటోలో కనిపిస్తోంది.
రెడ్ సారీలో అందంగా...
సాధారణంగానే ముద్దుగుమ్మలు చీర కట్టులో కాస్త ఎక్స్ పోజ్ చేస్తే వైరల్ కావడం పరిపాటిగా వస్తుంది. ఇక షామా సికిందర్ వంటి ముద్దుగుమ్మలు చీర కట్టి, అది కూడా రెడ్ సారీ కావడంతో చూపు తిప్పనివ్వడం లేదు. క్లీ వేజ్ షో చేస్తూ రెడ్ సారీ లో షామా సికిందర్ పిచ్చెక్కిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నారు ఏంటి మేడం అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో సాధారణంగా అందం తగ్గుతూ ఉంటుంది. కానీ మీ కెరీర్ ఆరంభంతో పోల్చితే ఇప్పుడే మరింత అందంగా ఉన్నారు అంటూ ఈ అమ్మడి అందం గురించి ప్రముఖంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి ఈమెకు ఆఫర్లు వస్తాయనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్‌లో వరుస సినిమాలు...
సుదీర్ఘ తన కెరీర్‌లో చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా బాలీవుడ్‌లో మంచి పేరును సొంతం చేసుకుంది. ఆమె ఓకే చెప్పాలి కానీ వరుసగా ఆఫర్లు వస్తాయి అనేది చాలా మంది అభిప్రాయం. కానీ షామా సికిందర్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఇస్తుంది. గ్లామర్ పాత్రలకు, ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రలకు, కథలో ప్రాధాన్యత లేని పాత్రలకు ఆమె నో చెబుతుందట. అందుకే ఆమె సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అంటారు. ముందుగా ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టినప్పటికీ వచ్చే ఆఫర్ల విషయంలో అసంతృప్తి కారణంగా బుల్లి తెరపై అడుగు పెట్టింది. అక్కడ తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కడం వల్లే అటు వైపు నుంచి ఈ అమ్మడు ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేసిందని అంటారు. అందుకే ఈ అమ్మడు బుల్లి తెర స్టార్‌గా నిలిచింది.
