పిక్‌టాక్ : చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు..!
అందంతో పాటు, ప్రతిభ ఉన్న నటి అయినప్పటికీ షాలిని పాండేకు దక్కాల్సిన గుర్తింపు, స్టార్‌డం దక్కలేదు అని ఆమె అభిమానులు అంటూ ఉంటారు.
By: Ramesh Palla | 6 Dec 2025 11:00 PM ISTఇండస్ట్రీ ఏదైనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంటే ఆ హీరోయిన్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాదు. వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుని కెరీర్‌లో దూసుకు పోవడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత కెరీర్ గురించి పక్కన పెడితే వరుసగా నాలుగు అయిదు సినిమాలకు సైన్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ షాలిని పాండే పాపం కెరీర్ పరంగా ఏమాత్రం ముందుకు సాగలేక పోయింది. షాలిని పాండే మొదటి సినిమా హిట్ అయినా ఆ తర్వాత నుంచి ఆఫర్లు పెద్దగా రాలేదు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర కారణంగా ఆఫర్లు రాలేదా... మరేదైనా కారణమా అనే విషయమై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.
అర్జున్ రెడ్డి హీరోయిన్‌కి ఆఫర్లు...
అందంతో పాటు, ప్రతిభ ఉన్న నటి అయినప్పటికీ షాలిని పాండేకు దక్కాల్సిన గుర్తింపు, స్టార్‌డం దక్కలేదు అని ఆమె అభిమానులు అంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే లక్షల మంది ఆమెకు ఇంకాస్త మెరుగ్గా సినిమా ఆఫర్లు రావాల్సింది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తారు. ముందు ముందు అయినా ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తాయి అనే విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్‌గా షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలు, వీడియోల కారణంగా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ సమయంలో ఈమెకు కచ్చితంగా హీరోయిన్‌గా మంచి భవిష్యత్తు ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. తీరా చూస్తే సినిమా ఆఫర్లు కనుమరుగు అవుతూ ఉంటాయి. కనీసం చిన్న సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సోషల్ మీడియాలో అందాల ఫోటోలు...
సోషల్ మీడియాలో ఎప్పటి మాదిరిగానే తాజాగా మరో అందమైన ఫోటో షూట్ ను షాలిని పాండే షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో సాధారణంగానే అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు. షాలిని పాండే విభిన్నమైన ఈ వైట్ ఔట్ ఫిట్‌ను ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. క్లీవేజ్ షో చేస్తూ చూపు తిప్పనివ్వకుండా అందంగా కనిపిస్తున్న షాలిని పాండే ఈ ఔట్ ఫిట్ లో అంతకు మించి అన్నట్లుగా ఉందని పలువురు అంటూ ఉన్నారు. ఇక ఈ ఫోటోల్లో షాలిని కాస్త బక్క చిక్కినట్లు గా అనిపిస్తుంది. అందుకే నెటిజన్స్ ఈ అమ్మడు చిక్కినా అందంగానే ఉంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. చక్కన్నమ్మ చిక్కినా అందమే అంటూ మరికొందరు సోషల్ మీడియా ద్వారా ఈ ఫోటోలు షేర్ చేస్తూ తెగ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఇడ్లీ కడై సినిమాలో ధనుష్ కి జోడీగా...
ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాదిలో ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కడై తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో మెయిన్ హీరోయిన్ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా షాలిని పాండే నటించింది. అయితే కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడం విశేషం. గత ఏడాది ఈమె మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఈ అమ్మడి పాత్ర పరిమితంగా ఉండటంతో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టడం లేదు, తద్వారా దక్కాల్సిన మరిన్ని ఆఫర్లు దక్కడం లేదు అనేది ఈమె అభిమానుల కంప్లైంట్. వచ్చే ఏడాది ఈమె నటిస్తున్న రాహు కేతువు అనే సినిమా రాబోతుంది. కనీసం ఆ సినిమా అయినా ఈ అమ్మడికి గుర్తింపు, స్టార్‌డం తెచ్చి పెడుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
