Begin typing your search above and press return to search.

ఇప్పుడు దీపికాను సమర్ధించడం అవసరమా షాలిని..?

దీపికా పదుకునే చెబుతున్న 8 గంటల షూటింగ్‌ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

By:  Ramesh Palla   |   14 Oct 2025 6:00 PM IST
ఇప్పుడు దీపికాను సమర్ధించడం అవసరమా షాలిని..?
X

అర్జున్‌ రెడ్డి సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన షాలిని పాండే ఎంట్రీతోనే అదరగొట్టింది. సౌత్‌లో అంతకు ముందు వరకు ఏ హీరోయిన్‌ పెట్టని లిప్‌ లాక్ సీన్స్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. షాలిని పాండే ఖచ్చితంగా బాలీవుడ్‌ పీస్ అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఆమెకు మంచి డిమాండ్‌ పెరిగింది. కానీ అర్జున్‌ రెడ్డి విజయం ఆమె కెరీర్‌ను టర్న్‌ చేయలేక పోయింది. ఆ సినిమా హిట్ అయింది, సినిమాలోని ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆమె మాత్రం ఇండస్ట్రీలో బిజీ కాలేక పోయింది. అర్జున్ రెడ్డి వల్ల కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ అవి పెద్దగా ఆమె కెరీర్‌ను నిలబెట్టలేక పోయాయి. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

దీపికా పదుకునే 8 గంటల పని నిబంధన

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ ఖచ్చితంగా 8 గంటల పని సమయం రూల్‌ ను పాటించాలని చెబుతూ వస్తుంది. ఆ రూల్‌ కారణంగానే దీపికా కొన్ని సినిమాలను సైతం వదులుకుంది అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌తో సందీప్‌ వంగ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్‌' సినిమాతో పాటు, ప్రభాస్‌ కల్కి 2 సినిమా నుంచి కూడా 8 గంటల వర్కింగ్‌ రూల్‌ కారణంగానే దీపికా తప్పుకుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ను లెక్కకు మించి గంటలు వర్క్‌ చేయిస్తున్నారు. అలా చేయడం వల్ల మానసిక సమస్యలు తలెత్తడంతో పాటు, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే సినిమాల షూటింగ్‌ ను కేవలం 8 గంటలకు పరిమితం చేయాల్సిందే అంటూ ఆమె ఒక ఉద్యమంను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

బాలీవుడ్‌ హీరోయిన్స్‌లో మార్పు

దీపికా పదుకునే చెబుతున్న 8 గంటల షూటింగ్‌ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇతర పనుల విషయంలో 8 గంటల సమయం అనేది వర్కౌట్‌ అవుతుంది. కానీ షూటింగ్‌ విషయంలో అలా సాధ్యం కాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 8 గంటల సమయంలో కనీసం రెండు నుంచి మూడు గంటల షూటింగ్‌ కూడా జరగదు అని, అందుకే ఎక్కువ సమయం విశ్రాంతిలోనే నటీనటులు ఉంటారు కనుక వారు 8 గంటల పని నిబంధన పాటించాల్సిన అవసరం లేదు అనేది చాలా మంది వాదన. కానీ హీరోయిన్‌ దీపికా పదుకునే మాత్రం తాను ఇప్పటికే ఆ నిబంధన పెట్టుకుని ప్రారంభించడం మొదలు పెట్టింది. ఆమెతో పాటు మరికొందరు హీరోయిన్స్‌ సైతం ఆ నిబంధనను పాటించేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ఒకరుగా అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలిని పాండే నిలువబోతున్నారు.

షాలిని పాండే వ్యాఖ్యలు సమర్ధనీయం కాదు

ఇటీవల షాలిని పాండే ఒక చిట్‌ చాట్‌లో మాట్లాడుతూ... తనకు దీపికా పదుకునే అంటే చాలా అభిమానం. స్కూల్‌ డేస్‌ నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాను. ఆమెను హీరోయిన్‌గా చాలా అభిమానిస్తాను, అంతే కాకుండా ఆమెను వ్యక్తిగతంగా కూడా ఆరాధిస్తాను. అందుకే ఆమె తీసుకు వచ్చిన 8 గంటల పని సమయంను తాను సమర్ధిస్తున్నాను. ఆమె తీసుకున్న నిర్ణయం అందరికీ ఉపయోగదాయకంగా తాను భావిస్తున్నాను అంది. అంతే కాకుండా కేవలం 8 గంటలు మాత్రమే వర్క్‌ చేస్తాను అని చెప్పడం ఆమె హక్కు, అది మానసిక ఆరోగ్యంను దెబ్బ తీయదు అని నేను నమ్ముతున్నాను. అందుకే నేను ఆ 8 గంటల పని సమయం నిబంధన పాటించడంలో తప్పు లేదు అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

ప్రతి మనిషికి విశ్రాంతి అవసరం అనేది ఆమె అభిప్రాయం. దాన్ని మనం సమర్ధించాల్సిందే అని మరో నటి కొంకనా సేన్‌ శర్మ అన్నారు. పెద్దగా ఆఫర్లు లేని షాలిని పాండే ఈ సమయంలో 8 గంటల నిబంధన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఇలా అయితే ఆఫర్లు ఎలా వస్తాయంటూ ఆమెను ప్రశ్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మరి దీనికి షాలిని ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.