Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి బ్యూటీ పార్టీల‌తో ఖుషీ

జీ స్టూడియోస్ - బిలైవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా `రాహు కేతు` చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ , షాలిని పాండే నటించారు. మ‌దిర బీట్ హై-ఎనర్జీతో ఆకట్టుకుంది.

By:  Sivaji Kontham   |   9 Dec 2025 10:00 PM IST
అర్జున్ రెడ్డి బ్యూటీ పార్టీల‌తో ఖుషీ
X

ప్ర‌తిభ‌తో ఇండ‌స్ట్రీలో లాంగ్ ర‌న్ కొన‌సాగించే న‌టీమ‌ణులు అరుదు. సాయిప‌ల్ల‌వి, ర‌ష్మిక మంద‌న్న‌, కియ‌రా లాంటి కొంద‌రికి ఇది సాధ్యం. అయితే కేవ‌లం ప్ర‌తిభ‌తో రాణిస్తున్న భామ‌ల్లో అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే పేరు కూడా ఉంది. షాలిని కెరీర్ ఆరంభం చిన్న సైడ్ పాత్ర‌ల‌తో మొద‌లైంది. ప్ర‌ధాన లీడ్ పాత్ర‌లో నటించిన `అర్జున్ రెడ్డి`తో స‌రైన గుర్తింపు ద‌క్కింది. మ‌హాన‌టి చిత్రంలోను చేసిన‌ది స‌హాయ‌క‌ పాత్రే అయినా చ‌క్క‌ని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. షాలిని త‌న‌దైన స‌హ‌జ‌న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఎంపిక చేసుకున్న పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల ప్ర‌తిభావ‌ని. అయితే ఈ బ్యూటీ గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి అంత‌గా సూట్ కాద‌నే అభిప్రాయం ఉంది. సాయిప‌ల్ల‌వి త‌ర‌హాలోనే షాలిని కూడా ఎక్స్ పోజ్ చేయ‌డానికి సూట్ కాద‌ని భావించేవారు. కానీ అంద‌రి ఊహ‌లు అంచ‌నాల‌కు భిన్నంగా ఇటీవ‌లి కాలంలో షాలిని త‌న ఎక్స్ ఫ్యాక్ట‌ర్ ని ఓపెన్ చేస్తూ గేమ్ ఛేంజ‌ర్ గా మారుతోంది. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీకి గ్లామ‌ర్ ట్రీట్ ఎలా ఇవ్వాలో త‌న‌కు తెలిసినంత‌గా ఇత‌రుల‌కు తెలీదు! అని నిరూపిస్తోంది.

షాలిని ఇటీవ‌ల బాలీవుడ్ లో పెద్ద హీరోల స‌ర‌స‌న న‌టించింది. కానీ ఆ సినిమాలు అంత‌గా క‌లిసి రాలేదు. ఇప్పుడు రాహు కేతు అనే సినిమాలో ఇద్ద‌రు కుర్రాళ్ల న‌డుమ న‌లిగిపోయే యువ‌తిగా న‌టిస్తోంది. ఈ చిత్రం నుండి `మదిర` అనే పాట‌ను తాజాగి రివీల్ చేసారు. ఇందులో షాలిని గ్లామ‌ర్ ఎలివేష‌న్ యూత్ కి మ‌త్తెక్కిస్తోంది. ఇది ఒక ప‌బ్ సాంగ్. ఇందులో మ‌త్తులో జోగుతున్న యూత్ ని చూడ‌గానే, బాలీవుడ్ డ్ర‌గ్ క‌ల్చ‌ర్ ని నిజాయితీగా ఎలివేట్ చేస్తూ, చిత్రీక‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌పరిచింది. మ‌త్తుకు బానిసైన యువ‌తీ యువ‌కుల ప్ర‌వ‌ర్త‌న‌ను ఈ పాట‌లో చూపించ‌డం నిజంగా షాకింగ్.

జీ స్టూడియోస్ - బిలైవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా `రాహు కేతు` చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ , షాలిని పాండే నటించారు. మ‌దిర బీట్ హై-ఎనర్జీతో ఆకట్టుకుంది. ఈ పాట ఈ సీజన్‌లోని ప్రతి నూతన సంవత్సర వేడుకకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగ‌ల‌ద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ముఖ్యంగా నాయ‌కానాయిక‌ల అద్బుత‌మైన డ్యాన్సులు కూడా ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఈ పాటను విక్రమ్ మాంట్రోస్ స్వరపరిచారు. సిమార్ కౌర్, అభినవ్ శేఖర్, విక్రమ్ మాంట్రోస్ పాడారు. అభినవ్ శేఖర్ పాట రాసారు.

విపుల్ గార్గ్ దర్శకత్వం వహించిన రాహు కేతును జీ స్టూడియోస్ విడుద‌ల చేస్తోంది. జీ స్టూడియోస్ - బిలైవ్ ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది. గ్రహాలు ఎల్లప్పుడూ ఒకేలా అనుకూలించ‌వు. కానీ నవ్వులు క‌చ్చితంగా ఒకేలా అల‌రిస్తాయి.. అనేది ట్యాగ్ లైన్. రాహు కేతు 16 జనవరి 2026న థియేటర్లలో విడుదల అవుతుంది.