Begin typing your search above and press return to search.

ఈ ఫోటోలు విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు అవకాశాలు ఇచ్చేనా..!

సినిమా హీరోయిన్లకు సోషల్ మీడియా ఇప్పుడు ఒక ముఖ్యమైన వేదికగా మారిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హీరోయిన్లు తమ గ్లామర్ ఫోటోలను, ఫ్యాషన్ ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   30 Oct 2026 11:34 AM IST
ఈ ఫోటోలు విజయ్ దేవరకొండ హీరోయిన్‌కు అవకాశాలు ఇచ్చేనా..!
X

సినిమా హీరోయిన్లకు సోషల్ మీడియా ఇప్పుడు ఒక ముఖ్యమైన వేదికగా మారిపోయింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హీరోయిన్లు తమ గ్లామర్ ఫోటోలను, ఫ్యాషన్ ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తమ అందం, ప్రతిభను చూపిస్తూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒక విధంగా హీరోయిన్లకు లింక్డ్ఇన్‌లా.. మారిపోయిందనే చెప్పాలి.




ఇప్పుడు ఇదే దారిలో.. నటి షాలిని పాండే ఫోటోలు కారణమవుతున్నాయి. తాజాగా ఆమె ఎరుపు రంగు బికినీలో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన ఫిట్‌నెస్, గ్లామరస్ లుక్‌తో షాలిని అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోల్లో ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




షాలిని పాండేకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'మఅర్జున్ రెడ్డి..సినిమాతో ఆమె హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రీతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో కూడా షాలిని కనిపించింది. ఇందులో కీర్తి సురేష్ స్నేహితురాలి పాత్రలో నటించింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో వరుస అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఆమె చేసిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన.. ఆమెకు మాత్రం తగినంత పేరు రాలేదు.




ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. సాధారణంగా హీరోయిన్ల ఫోటోలను నిర్మాతలు, దర్శకులు కూడా గమనిస్తుంటారు. కొత్త సినిమాలకు నటీనటులను ఎంపిక చేసే సమయంలో వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ ఫోటోలు షాలినికి కొత్త సినిమా అవకాశాలు తీసుకొస్తాయా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. గ్లామర్ ఫోటోలు మాత్రమే సినిమా అవకాశాలను తెచ్చిపెట్టలేవు. మంచి కథలు, బలమైన పాత్రలు, నటన కూడా అంతే ముఖ్యం. మరి షాలిని పాండేకు ఈ కొత్త గ్లామర్ లుక్‌తో మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి..