అది నేను కాదు.. ఫేక్ వీడియోపై హీరోయిన్ క్లారిటీ
ముఖ్యంగా మహిళలను ఇలాంటి ఫేక్ కంటెంట్‌తో ఇబ్బంది పెట్టడం మరింత బాధ కలిగిస్తోందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
By: M Prashanth | 31 Aug 2026 5:02 PM ISTసోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ వీడియోపై శాలిని పాండే ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో తనది కాదని, పూర్తిగా AIతో తయారు చేసిన ఫేక్ వీడియో అని ఒక పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. కొంతకాలంగా ఆ క్లిప్ షేర్ అవుతుండటంతో అసలు అది నిజమేనా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఇప్పుడు శాలినే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీనిపై మాట్లాడారు.
ఆ వీడియోలో కనిపిస్తున్నది తాను కాదని శాలిని స్పష్టంగా తెలియజేశారు. తనను చూపిస్తున్నట్లుగా మొత్తం వీడియోను తయారు చేశారని, టెక్నాలజీని ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి వాడటం చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళలను ఇలాంటి ఫేక్ కంటెంట్‌తో ఇబ్బంది పెట్టడం మరింత బాధ కలిగిస్తోందని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇలాంటి AI వీడియోలను ఒక సాధారణ విషయంగా తీసుకోవద్దని కూడా శాలిని కోరింది. ఎవరైనా ఆ వీడియోను చూసినా షేర్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, డౌన్‌లోడ్ కూడా చేయొద్దని చెప్పారు. దానిపై కామెంట్ చేయడం లేదా ఇంకేదైనా రియాక్షన్ ఇచ్చి మరింత మందికి చేరేలా చేయవద్దని, దాని బదులు వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పారు.
ఈమధ్య కాలంలో AI టెక్నాలజీతో ఎవరి పోటో అయినా తీసుకుని కంటెంట్ తయారు చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ దాని వల్ల టార్గెట్ అయిన వ్యక్తికి వచ్చే ఇబ్బందిని పట్టించుకోకుండా అలాంటి వీడియోలను వైరల్ చేయడం సరికాదని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు షాలిని మాటల్లో కూడా కనిపించింది. అందుకే దానికి మరింత రీచ్ ఇవ్వకుండా ఆపాలని కోరారు.
‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శాలిని పాండే తర్వాత హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల ధనుష్ ‘ఇడ్లీ కడై’లో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్‌తో కాకుండా ఈ ఫేక్ వీడియో కారణంగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా ముందుకొచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
అయితే తన స్టేట్‌మెంట్‌లో పోలీసు ఫిర్యాదు లేదా లీగల్ యాక్షన్ గురించి శాలిని ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఆమె చేసిన రిక్వెస్ట్ ఒక్కటే. ఆ వీడియో ఎక్కడ కనిపించినా దాన్ని మరో వ్యక్తికి పంపకుండా అక్కడే రిపోర్ట్ చేయాలి అని. తన పేరుతో తిరుగుతున్న ఆ క్లిప్‌కు తానేమాత్రం సంబంధం లేదని మాత్రం శాలిని పక్కాగా చెప్పేసింది. ఇక ఆమెకు మద్దతుగా ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందో లేదో చూడాలి.
