హీరోయిన్ తండ్రి ప్యాన్సీ షాప్ ఓనర్!
తాజాగా షాలిని తండ్రి ఎలైస్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. వాటినే బాబు స్వయంగా రివీల్ చేయడం విశేషం.
By: Srikanth Kontham | 31 Oct 2025 8:00 AM IST`సఖి` ఫేం షాలిని గురించి పరిచయం అవసరం లేదు. బాల నటిగా ఎంతో ఫేమస్. లీడ్ రొల్స్ చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నీ ఐకానిక్ చిత్రాలు కావడంతో? హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కిం చుకుంది. `సఖి` సినిమాతో అప్పట్లో ఎంతో మంది హృదయాలు దోచిన నటి. అటుపై తల అజిత్ ను ప్రేమ వివాహం చేసుకుని స్థిరపడింది. అప్పటి నుంచి సినిమాలకు దూరమైంది. భర్త , పిల్లలు కుటుంబం అంటూ అక్కడికే పరిమితయ్యారు. అప్పటి నుంచి సినిమా వేడుకలకు అటెండ్ అవ్వడం కూడా చాలా రేర్ గా జరుగుతుంది.
తాజాగా షాలిని తండ్రి ఎలైస్ బాబు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. వాటినే బాబు స్వయంగా రివీల్ చేయడం విశేషం. ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫామిలీ చూసినవాడిని...ఇప్పుడు మాత్రం మంచి పోసిషన్ లోనే ఉన్నాను అని అన్నారు. అప్పట్లో ఓ ప్యాన్సీ షాప్ కూడా నిర్వహించేవాడినన్నారు. దేవుడు దయవల్ల కొన్ని రకాల పరిస్థితులు తమకు కలిసి రావడం వల్ల బాగా సంపాదించుకో గలిగాం అన్నారు. కుమార్తెలకు సినిమా ఛాన్సులు వచ్చిన సమయంలో తానే స్వయంగా వాళ్లను పట్టుకుని తిరిగేవాడినన్నారు.
తన భార్యను కూడా సినిమా వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసుకుందువు అని అడిగితే తాను మాత్రం ఇల్లు దాటి బయటకు వచ్చేది కాదని అన్నారు. తన గురించి ..తన కుటుంబం గురించి కొందరు తప్పుగా మాట్లాడారని..అయినా వాటిని పట్టించుకోనన్నారు. కష్టపడి పని చేయడంలో తప్పేముంది? అన్నది మాత్రమే తాను చూస్తానని...ఎవరో? ఏదో అన్నారని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఎలైస్ బాబు దంపతులకు ముగ్గురు సంతానం. షాలిని,-షామిలీ, కుమారుడు రిచర్డ్ కలరు. ముగ్గురు సినిమాల్లోకి వచ్చారు.
షాలిని చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి వచ్చారు. అప్పట్లో ఆమె ఎంతో ఫేమస్. రెండవ కుమార్తె కూడా నటిగా కొన్ని సినిమాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె కూడా సినిమాల్లో కొనసాగలేదు. కుమారుడు రిచర్స్డ్ మాత్రం నటుడిగా కొనసాగుతున్నాడు. అలాగే షాలిని భర్త అజిత్ ఇప్పుడు ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటున్నాడని..తీసుకున్న అమౌంట్ కు తగ్గ టాక్స్ లు కూడా సవ్యంగా చెల్లిస్తున్నారని బాబు తెలిపారు.
