యువతకు హిట్ మ్యాన్ విలువైన సలహా!!
సినిమాల ద్వారా డైరెక్టర్లు చాలా విషయాలు చెబుతుంటారు. అందులో మంచి సందేశాలు కూడా ఉంటాయి. కానీ రియల్ లైఫ్ కి వచ్చేసరికి చాలా మంది దర్శకులు సలహాలివ్వడానికి ముందుకురారు.
By: Srikanth Kontham | 12 Nov 2025 1:00 PM ISTసినిమాల ద్వారా డైరెక్టర్లు చాలా విషయాలు చెబుతుంటారు. అందులో మంచి సందేశాలు కూడా ఉంటాయి. కానీ రియల్ లైఫ్ కి వచ్చేసరికి చాలా మంది దర్శకులు సలహాలివ్వడానికి ముందుకురారు. ఆ పని కొందరు మాత్రమే ధైర్యంగా చేయగలరు. అలాంటి వారిలో పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ లాంటి వారు ప్రముఖంగా కనిపిస్తారు. యువతను ఉద్దేశించి వీరు అప్పుడప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా స్పందిస్తుంటారు. అవి ఎంతో గొప్పగానూ ఉంటాయి. వాళ్లు చూసిన జీవితాలు..వాళ్ల అనుభవాల నుంచి వచ్చిన విషయాలే అవన్నీ. తాజాగా వాళ్ల సరసన `హిట్` మ్యాన్ శైలేష్ కొలను కూడా చేరాడు.
`సంతాన ప్రాప్తిరస్తు` ప్రమోషన్ లో భాగంగా విచ్చేసిన శైలేష్...ఆ సినిమా థీమ్ ను ఉద్దేశించడంతో పాటు...యువత లో కూడా అవేర్ నెస్ తీసుకురావాలి? అన్న కోణంలో స్పందించారు. `పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు ఎప్పుడు? అని అడగడం మాత్రం భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతుందని..మిగతా దేశాల్లో అలాంటి చర్చ ఉండదన్నారు. పెళ్లైన వారిని ఇలా అడగడం వల్ల ఎంతో స్ట్రెస్ ఉంటుందన్నారు. `ఆ స్ట్రెస్ తోనే సమస్యలు మొదలవుతాయి. పెళ్లైన పదేళ్ల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. అంత వరకూ జీవితాన్ని ఆస్వాదించండి. అంత వరకూ అనవసరంగా ఒత్తిడికి గురి కాకండన్నారు.
`నాకు 2012లో పెళ్లైంది. పదేళ్ల తర్వాత పిల్లల్ని కందామని నేను మావైఫ్ డిసైడ్ అయి ప్లాన్ చేసుకున్నాం. డేటింగ్ లో ఉన్న సమయంలోనే తీసుకున్న నిర్ణయమది. ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత పార్టనర్ ని బాగా అర్దం చేసుకోవాలి. జీవితాన్ని ఆస్వాదించండి. నా నిజమైన అనుభవం నుంచి చెబుతోన్న మాట ఇది. ఇదే తాను యువతకు ఇచ్చే సలహా` అంటూ ముగించారు. మరి ఈ సలహాపై యువత ఎలా స్పందిస్తుందో చూడాలి.
శైలేష్ కొలను చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. క్లైమ్ థ్రిల్లర్లు తీయడంలో ఆయనో స్పెషలిస్ట్.`హిట్` తో డైరెక్టర్ గా లాంచ్ అయ్యాడు. తొలి కేస్ బ్లాక్ బస్టర్ అయింది. అటుపై మరో జానర్ కు వెళ్లకుండా `హిట్ 2` తీసి మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మెడికల్ క్రైమ్ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా `సైంధవ్` తెరెక్కించాడు. భారీ అంచనాల మధ్య చేసిన ప్రాజెక్ట్ ఇది. కానీ వాటిని అందుకోవడంలో విఫలమైంది. దీంతో శైలేష్ కి తొలి ప్లాప్ అక్కడ ఎదురైంది. ఆ వెంటనే ఏడాది గ్యాప్ లోనే `హిట్ ది థర్డ్ కే`స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం `హిట్ ది -ఫోర్త్ కేస్` స్టోరీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇందులో తమిళ హీరో కార్తీ ఎంపికైన సంగతి తెలిసిందే.
