Begin typing your search above and press return to search.

భార‌త దేశాన్ని ఊపేయ‌బోతున్న వైరస్ ఈ అంత‌ర్జాతీయ గాయ‌ని!

ముంబై షోకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్వాహకులు మరో అదనపు షోను ఖరారు చేశారు. ఏప్రిల్ 11న మహాలక్ష్మి రేస్‌కోర్స్ వేదికగా మూడవ ప్రదర్శన జరగనుంది.

By:  Sivaji Kontham   |   10 March 2026 9:41 AM IST
భార‌త దేశాన్ని ఊపేయ‌బోతున్న వైరస్ ఈ అంత‌ర్జాతీయ గాయ‌ని!
X

ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించే పాప్ కన్సర్ట్‌లకు భారత్ ఇప్పుడు ఒక ప్రధాన వేదికగా మారింది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయి పాప్ సింగర్లు భారతదేశంలో పర్యటించి ఇక్కడి అభిమానులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చారు. తాజాగా ఈ జాబితాలోకి గ్లోబల్ పాప్ సెన్సేషన్ షకీరా వచ్చి చేరడం విశేషం. భారత్‌లో లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన లేదా ఇవ్వబోతున్న టాప్-5 విదేశీ పాప్ సింగర్ల వివరాలను పరిశీలిస్తే మన దేశంలో పాప్ సంగీతానికి ఉన్న క్రేజ్ అర్థమవుతుంది.

షకీరా పేరు వినగానే త‌న‌ విలక్షణమైన గాత్రం.. అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ గుర్తొస్తాయి. భారతదేశంలో షకీరాకు ఉన్న ఫ్యాన్ బేస్ అసాధారణమైనది. ఆమె ఇండియా టూర్ ప్రకటన రాగానే ముంబై, ఢిల్లీ నగరాల్లోని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షకీరా ప్రదర్శన అంటే స్టేజ్ మీద ఎనర్జీ సలసల కాగిపోవడం గ్యారెంటీ అని ఆమె ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 10న ముంబైలో, ఏప్రిల్ 15న ఢిల్లీలో నిర్వహించనున్న షోలకు భారీ స్పందన లభించింది.

ముంబై షోకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్వాహకులు మరో అదనపు షోను ఖరారు చేశారు. ఏప్రిల్ 11న మహాలక్ష్మి రేస్‌కోర్స్ వేదికగా మూడవ ప్రదర్శన జరగనుంది. ఈ వార్తతో ముంబై వాసుల ఆనందానికి అవధులు లేవు. కేవలం షకీరా పాటలే కాకుండా.. త‌న‌ ప్రదర్శనలో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ , కొరియోగ్రఫీ కోసం భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఈవెంట్లలో ఒకటిగా నిలవనుంది.

ఈ కన్సర్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ తోడవనుంది. భారతీయ మ్యూజిక్ సెన్సేషన్ దిల్జీత్ దోసాంజ్, షకీరాతో కలిసి స్టేజ్ షేర్ చేసుకునేందుకు ఆస్కారం ఉంద‌ని స‌మాచారం. అంతర్జాతీయ పాప్ స్టార్, ఇండియన్ రాక్ స్టార్ ఒకే వేదికపై కనిపించనుండటం ఈ షో రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వీరిద్దరి కాంబినేషన్లో పెర్ఫామెన్స్ సంగీత ప్రియులకు అసలైన `పైసా వసూల్` వినోదాన్ని అందించడం ఖాయం. గ్లోబల్ మ్యూజిక్ - దేశీ టచ్ కలయిక కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.

గతంలో కూడా మైఖేల్ జాక్సన్ వంటి దిగ్గజాలు భారత్‌లో ప్రదర్శనలు ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత కోల్డ్ ప్లే, ఎడ్ షీరన్, జస్టిన్ బీబర్ వంటి టాప్ అంతర్జాతీయ సింగర్లు ఇక్కడి స్టేడియంలను హోరెత్తించారు. ఇప్పుడు షకీరా రాకతో ఆ జాబితా మరింత సుసంపన్నం కానుంది. ఈ టాప్-5 పాప్ స్టార్ల ప్రదర్శనలు భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్మెంట్ మ్యాప్‌లో టాప్ పొజిషన్‌లో నిలబెట్టాయి. అంతర్జాతీయ కళాకారులకు భారత్ ఒక సురక్షితమైన .. ఉత్సాహభరితమైన మార్కెట్‌గా మారింది.

షకీరా ఇండియా టూర్ కేవలం ఒక సంగీత కార్యక్రమం మాత్రమే కాదు..ఇది రెండు భిన్నమైన సంస్కృతుల కలయిక. ఏప్రిల్ నెలలో జరగనున్న ఈ లైవ్ కన్సర్ట్‌లు దేశవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను ఒకే చోట చేర్చనున్నాయి. షకీరా గొంతులో నుంచి వచ్చే ఆ `వాకా వాకా` మ్యాజిక్ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఇటీవ‌లి ట్రెండ్ చూస్తుంటే మునుముందు మరిన్ని అంతర్జాతీయ ప్రతిభావంతులు భారతదేశాన్ని తమ ప్రదర్శనలకు వేదికగా ఎంచుకోవడంలో సందేహం లేదు.