సూపర్ స్టార్‌కి గుండె పోటు వార్తలపై క్లారిటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇటీవల షూటింగ్‌లో గాయ పడ్డాడు అనే వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
By: Ramesh Palla | 31 July 2025 1:12 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇటీవల షూటింగ్‌లో గాయ పడ్డాడు అనే వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ గాయంకి చికిత్స నిమిత్తం షారుఖ్ ఖాన్ అమెరికా వెళ్లారు. గత కొన్ని రోజులుగా షారుఖ్ ఖాన్ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో షారుఖ్ ఖాన్ ఆసుపత్రి నుంచి భారీ సెక్యూరిటీ మధ్య బయటకు వస్తున్నట్లు ఉంది. సెక్యూరిటీ కారణంగా షారుఖ్ ఖాన్ ఎక్కువగా కనిపించలేదు, కానీ షారుఖ్ ఖాన్ చేతికి గాయం ఉందని, అతడి చేతి కట్టును బట్టి చూస్తూ ఉంటే పెద్ద ప్రమాదం ఏమీ లేదని అనిపిస్తుందని వీడియోను షేర్ చేసిన నెటిజన్ కామెంట్ చేశాడు, అమెరికాలో షారుఖ్ ఖాన్ చేతికి శస్త్ర చికిత్స జరిగిన మాట వాస్తవం అని వీడియో తో క్లారిటీ ఇచ్చింది.
షారుఖ్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు
ఆ వీడియో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్‌కి గుండె పోటు వచ్చిందనే వార్తలు గుప్పుమన్నాయి. షారుఖ్ ఖాన్ కి స్వల్ప గుండె పోటు రావడంతో అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనే వార్తలు వచ్చాయి. గుండె పోటు కారణంగా ఆయన షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నాడు. కనీసం మూడు నుంచి ఐదు నెలల పాటు ఆయన గుండెకు సంబంధించిన చికిత్స ను అమెరికాలో తీసుకోనున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లపై షారుఖ్ ఖాన్ టీం స్పందించింది. ఆఫ్ ది రికార్డ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. షారుఖ్ ఖాన్ కి గుండె పోటు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. అలాంటి ప్రచారం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్పారట. జాతీయ మీడియాలో షారుఖ్ గుండె పోటు వార్తలు ఖండిస్తూ కథనాలు వచ్చాయి.
కింగ్ ఖాన్ చేతికి శస్త్ర చికిత్స
షారుఖ్ ఖాన్ ఆరోగ్యం గురించి గతంలోనూ కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. వయసు పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలు వేధించడం చాలా కామన్ విషయం. కానీ షారుఖ్ ఖాన్ వంటి డైట్ ఫాలో అయ్యే వారికి, స్వచ్చమైన ఆహారం తీసుకునే వారికి, రెగ్యులర్‌గా వర్కౌట్‌లు చేసే వారికి వయసుతో సంబంధం లేదు. ఏడు పదుల వయసులోనూ వారు పాతికేళ్ల పడుచు కుర్రాళ్ల మాదిరిగా యాక్టివ్‌గా ఉండగలరు. కనుక షారుఖ్ ఖాన్ యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన అక్కర్లేదు అనేది ఆయన సన్నిహితుల మాట. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చేతికి జరిగిన చిన్న శస్త్ర చికిత్స కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతి త్వరలోనే తిరిగి షారుఖ్ ఖాన్ సెట్స్ లో జాయిన్ కావడం ఖాయం అనే అభిప్రాయంను ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.
'కింగ్' సినిమాలో సుహానా ఖాన్
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమాలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తనయ సుహానా ఖాన్ కీలక పాత్రలో నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. షారుఖ్ ఖాన్ కూతురుగా సుహానా ఖాన్ కనిపించే అవకాశాలు ఉన్నాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు ఏ పాత్రల్లో కనిపించినా ఒకే సారి స్క్రీన్ పై కనిపించినప్పుడు అభిమానులకు చూడ్డానికి రెండు కళ్లు చాలవు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్‌కు జోడీగా దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఇంకా ఈ సినిమాలో సౌరభ్ శుక్లా, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమా గురించి మరిన్ని వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2026 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
