Begin typing your search above and press return to search.

ఇదేం ట్విస్ట్ భ‌య్యా..ఇలా కూడా చేస్తారా!

ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సినిమా ప్రారంభోత్స‌వం అంటే? బోలెడంత హ‌డావుడి ఉంటుంది. హీరో, డైరెక్ట‌ర్, నిర్మాత‌లతో పాటు ఓ ఇద్ద‌రు ముగ్గురు స్పెష‌ల్ గెస్ట్ లు కూడా ఉంటారు.

By:  Srikanth Kontham   |   2 Sept 2025 2:00 AM IST
ఇదేం ట్విస్ట్ భ‌య్యా..ఇలా కూడా చేస్తారా!
X

ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సినిమా ప్రారంభోత్స‌వం అంటే? బోలెడంత హ‌డావుడి ఉంటుంది. హీరో, డైరెక్ట‌ర్, నిర్మాత‌లతో పాటు ఓ ఇద్ద‌రు ముగ్గురు స్పెష‌ల్ గెస్ట్ లు కూడా ఉంటారు. వాళ్ల చేతుల మీదుగానే సినిమా లాంచ్ అవుతుంది. సంద‌ర్భాన్ని బ‌ట్టి అభిమానులు కూడా హాజ‌ర‌వుతుంటారు. మీడియా క‌వ‌రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియా కూడా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత సినిమా ప్ర‌చారం అన్న‌ది పీక్స్ కు చేరిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోష‌ల్ మీడియా కూడా అందు బాటులోకి రావ‌డంతో? నిర్మాత‌ల‌కు కోట్ల రూపాయ‌ల ప‌బ్లిసిటీ దొరుకుతుంది.

సైలెంట్ గా షాక్ ఇచ్చారుగా:

మీడియా ను ఆహ్వా నించినా? ఆహ్వానించ‌క‌పోయినా? ఏదో రూపంలో పీడ్ సంపాదించి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం అన్న‌ది ప‌రిపాటిగా మారింది. ఎంత గుట్టు చ‌ప్పుకుండా కాకుండా లాంచ్ చేయాల‌న్నా? ఏదో రూపంలో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. అలాంటి రోజుల్లో ఓ హిందీ సినిమా సైలెంట్ గా ప్రారంభ మ‌వ్వ‌డం..షూటింగ్ పూర్త‌వ్వ‌డం గురించి తెలిస్తే? షాక్ అవ్వాల్సిందే. సోష‌ల్ మీడియా జ‌మానాలో? కూడా విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా సీక్రెట్ గా కానిచ్చారంటే వాళ్ల ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అద్దం ప‌డుతుంది.

షాక్ ఇచ్చిన షాహిద్:

ఇంత‌కీ ఏంటా సినిమా? ఎవ‌రా హీరో అంటే? వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ హీరోగా విశాల్ భర‌ద్వాజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింది. ఈ విష‌యాన్ని షాహిద్ క‌పూర్ రివీల్ చేసాడు. అస‌లు ఈ కాంబోలో సినిమా ఉంద‌ని కూడా బాలీవుడ్ మీడియాలో ఎక్క‌డా వార్త‌లు రాలేదు. షాహిద్ చెప్ప‌డంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

నాల్గ‌వ‌సారి క్రేజీ కాంబో:

`ఎప్ప‌టికీ లాగే ఇది ఓ కొత్త ప్ర‌పంచం. వైవిథ్యమైన పాత్ర‌తో మీ ముందుకు రాబోతున్నా. విశాల్ తో క‌లిసి నాల్గ‌వ‌సారి ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఓ సూప‌ర్ స్పెష‌ల్ చిత్రంగా నిలుస్తుంద‌న్నారు. దీంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమా గురించి కనీసం చిన్న వార్త కూడా ఎక్క‌డా రాలేదు. అలాంటింది ఏకంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి స‌ర్ ప్రైజ్ ఇచ్చారంటూ నెట్టింట కామెంట్లు ప్ర‌త్య‌క్ష మవుతున్నాయి. గ‌తంలో ఇదే కాంబినేష‌న్ లో `హైద‌ర్`, `రంగూన్`, `క‌మీనే` లాంటి చిత్రాలు తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే.