Begin typing your search above and press return to search.

షాహిద్ కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్.. ఆస్తులు, కార్లు, డ్రీమ్ హౌస్ అబ్బో..

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు.

By:  Madhu Reddy   |   15 Oct 2025 5:00 PM IST
షాహిద్ కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్.. ఆస్తులు, కార్లు, డ్రీమ్ హౌస్ అబ్బో..
X

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. అలా ఇష్క్ విష్క్, కబీర్ సింగ్, జబ్ వి మెట్, వివాహ్ వంటి సినిమాలు షాహిద్ కపూర్ కి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే అలాంటి షాహిద్ కపూర్ సినిమాలు, వ్యాపారాలు అంటూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. మరి ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా నటుడిగా రాణిస్తున్న షాహిద్ కపూర్ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు..?ఆయన లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ? అనేది ఇప్పుడు చూద్దాం..

షాహిద్ కపూర్ ఒక రాజభవనం లాంటి ఇంట్లో లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. ఆయన కేవలం లగ్జరీ ఇల్లు మాత్రమే కాదు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్నారు.. షాహిద్ కపూర్ అతని భార్య మీరా రాజ్ పుత్ తో కలిసి 2019లో ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఓ విశాలమైన డూప్లెక్స్ హౌస్ ని కొనుగోలు చేశారు. ఐకానిక్ 360 వెస్ట్ టవర్ లో ఉండే ఈ డూప్లెక్స్ హౌస్ విలువ అక్షరాల రూ.58 కోట్లు..8,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విశాలమైన డూప్లెక్స్ హౌస్ నుండి బయటకు చూస్తే సీ వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది. ఓపెన్ బాల్కనీతో పాటు ప్రైవేట్ లిఫ్టు,లగ్జరీ ఫినిషింగ్ ఇలా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ ని కలిగి ఉన్న ఆ డూప్లెక్స్ హౌస్ ని షాహిద్ కపూర్ ఫ్యామిలీ కోసం ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నారు.

షాహిద్ కపూర్ కి కార్లు అంటే విపరీతమైన ఇష్టం. ఆయన కార్ గ్యారేజీలో కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. 3.5 కోట్ల విలువచేసే మెర్సిడెస్-మేబాచ్ GLS 600 తో పాటు, మెర్సిడెస్ ఎస్-క్లాస్ S580, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే కయెన్ GTS, మెర్సిడెస్-బెంజ్ GL- క్లాస్, జాగ్వార్ XKR-S వంటి లగ్జరీ కార్లు కలిగి ఉన్నారు.. ఈ లగ్జరీ కార్ల ధర కోట్లలోనే ఉంటుంది.

అలా షాహిద్ కపూర్ సినిమాలు, యాడ్స్, బిజినెస్ లు అంటూ దాదాపు 300 కోట్ల వరకు ఆస్తిపాస్తులు సంపాదించారు.అలాగే షాహిద్ కపూర్ తన ఒక్కో సినిమాకి దాదాపు 30 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటారు. అలాగే ఓవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుండి కూడా డబ్బు సంపాదిస్తున్నారు.అలా ఒక్కో యాడ్ కి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

అలాగే సినిమాలు చేస్తూనే మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతూ అక్కడ కూడా భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా కొన్ని బిజినెస్ లు కూడా చేస్తున్నారు. అలా సినిమాలు,బిజినెస్ లు, రియల్ ఎస్టేట్, వ్యాపార ప్రకటనలు అంటూ వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు..

ఇక షాహిద్ కపూర్ సినిమాల్లో ఏ కాస్త గ్యాప్ దొరికినా చాలు ఫ్యామిలీతో కలిసి ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా తరచూ తన ఫ్యామిలీతో కలిసి టూర్లు,వెకేషన్ లు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు..