Begin typing your search above and press return to search.

సల్మాన్‌ ఖాన్‌కి కొడుకు ఉంటే... షారుక్‌ కామెంట్స్‌!

బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్‌పైకి వచ్చారు.

By:  Ramesh Palla   |   19 Oct 2025 8:00 PM IST
సల్మాన్‌ ఖాన్‌కి కొడుకు ఉంటే... షారుక్‌ కామెంట్స్‌!
X

బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు చాలా కాలం తర్వాత ఒకే స్టేజ్‌పైకి వచ్చారు. వీరు ముగ్గురు రియాద్‌లోని జాయ్‌ ఫోరం 2025 వేదికగా కలిశారు. ఎన్నో విషయాల గురించి ఈ ముగ్గురు మాట్లాడారు. ముఖ్యంగా వారసులు, వారు చూపిస్తున్న ప్రతిభ గురించి మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దర్శకుడిగా మంచి ప్రతిభ కనబర్చడం చాలా సంతోషాన్ని కలిగించింది అన్నాడు. అతడి ప్రతిభ పట్ల నేను ఫిల్‌ ఖుషి అయ్యాను. అతడు గొప్ప దర్శకుడు కావాలని కోరుకుంటున్నాడు. ముందు ముందు ఆయన నుంచి మంచి ప్రాజెక్ట్‌లు వస్తాయి అనే నమ్మకంను సల్మాన్‌ ఖాన్‌ వ్యక్తం చేశాడు. షారుఖ్‌ ఖాన్‌ గర్వించే విధంగా ఆర్యన్‌ ఖాన్‌ ప్రాజెక్ట్‌లు ఉండాలి అంటూ సల్మాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు అంతా కూడా చప్పట్లు కొట్టారు.

సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్ ఖాన్‌ల స్పందన

అదే సమయంలో సల్మాన్‌ ఖాన్‌ గురించి షారుఖ్‌ ఖాన్‌ స్పందించాడు. ఒకవేళ సల్మాన్‌ ఖాన్‌ కి వారసులు ఉండి ఉంటే తప్పకుండా గొప్ప విజయాన్ని సొంతం చేసుకునేవాడు. సల్మాన్‌ వారసుడు మానవ జాతి చరిత్రలోనే గొప్ప స్టార్‌ కావాలని నేరు కోరుకునేవాడిని అని షారుఖ్‌ అన్నాడు. కానీ సల్మాన్‌ ఖాన్‌ అలా అనుకున్నట్లుగా లేడు అన్నాడు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ప్రముఖంగా మాట్లాడుకోవడంతో పాటు, ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న వారసుల గురించి, వారి ప్రతిభ గురించి, వారు కష్టపడుతున్న తీరు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడిన మాటలతో పాటు, ఆ సమయంలో ఆమీర్‌ ఖాన్‌ మాట్లాడిన మాటలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సల్మాన్‌ ఖాన్‌ వారసుడు ఇండస్ట్రీలో స్టార్‌ అయ్యేవాడని అభిమానులు సైతం అంటున్నారు.

ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో..

ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో వచ్చిన బాడ్స్ ఆఫ్‌ బాలీవుడ్‌కి మంచి స్పందన వచ్చింది. అందుకే దర్శకుడిగా ఆయన ముందు ముందు మరిన్ని సినిమాలు చేయడం ఖాయం. సల్మాన్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌ వంటి స్టార్స్‌తో ఈయన సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజా కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేకంగా ఆర్యన్‌ ఖాన్‌ ను గురించి ప్రస్తావించాడు. కనుక వీరిద్దరి కాంబోలో సినిమా రావాలి, అది సూపర్‌ హిట్‌ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ సైతం నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి ఆర్యన్‌ ఖాన్‌ దృష్టి బాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌ ప్రమోషన్‌ పైనే ఉంది. ఆయన భవిష్యత్తులో హీరోగా నటించాలని కోరుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆయన దర్శకత్వంపైనే ఆసక్తి చూపిస్తున్నాడు.

ఆమీర్‌ ఖాన్‌ హీరోగా ఆర్యన్‌ ఖాన్‌...

సల్మాన్‌ ఖాన్‌ సికిందర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ ఒక్క సినిమా మాత్రమే కాకుండా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా హిట్‌ లేక ఛాలా ఢీలా పడ్డాడు. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌లో ఆయన హీరోగా ఆర్యన్‌ ఖాన్‌ ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమీర్‌ ఖాన్‌ కెరీర్‌ కూడా ఒడిదొడుకుల్లో ఉంది. కనుక ఖచ్చితంగా వీరిద్దరి కాంబోలో మూవీ రావాలని కోరుకునే వారు ఉన్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ కాంబోలో మూవీ రావాలి, ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ వారసుడి గురించి మాత్రం మళ్లీ కొత్త కథనాలు వస్తున్నాయి. ఆయన పెళ్లికి దూరంగా ఉండటంతో వారసులు రాలేదు. ఆయన వారసులు ముందు ముందు అయినా వస్తారా అనే అనుమానం ఉంది. ఆయన పెళ్లికి పూర్తిగా దూరం ఉంటే ఆయన వారసులు రావడం కష్టమే..!