ఇంటి డిజైనింగ్ వెనుక షారుఖ్ ఖాన్ సరదా హెచ్చరిక
సెలబ్రిటీల జీవనశైలి.. విలాసవంతమైన ఇళ్లు ఎప్పుడూ సాధారణ ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.
By: Srikanth Kontham | 15 Jun 2026 8:00 PM ISTసెలబ్రిటీల జీవనశైలి.. విలాసవంతమైన ఇళ్లు ఎప్పుడూ సాధారణ ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. బాలీవుడ్‌లో అగ్ర నటీనటులు.. గాయకులు కలల సౌధాలను అత్యంత లగ్జరీగా తీర్చిదిద్దుకోవడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ల సహాయంతో ఇళ్లకు ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంటారు. కేవలం నివాసం కోసమే కాకుండా..సామాజిక హోదాకు అద్దం పట్టేలా ఇళ్లను డిజైన్ చేయించుకోవడం నేడు పెద్ద ట్రెండ్‌గా మారింది. బాలీవుడ్ సింగర్ మీకా సింగ్ ఇటీవల తన విలాసవంతమైన 50 కోట్ల విలువైన ఇంటికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌కు అప్పగించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందు షారుఖ్ ఖాన్ తనకు ఇచ్చిన ఓ సరదా హెచ్చరికను మీకా సింగ్ గుర్తుచేసుకుని నవ్వులు పూయించారు. గౌరీ ఖాన్‌తో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనే మీకా సింగ్ నిర్ణయంపై షారుఖ్ ఖాన్ హాస్యాస్పదంగా మాట్లాడారట. `ఆమె (గౌరీ) నిన్ను బాగా లూటీ చేస్తుంది.. చాలా ఎక్కువ ఫీజు వసూలు చేస్తుంది అంటూ షారుఖ్ సరదాగా మీకాను హెచ్చరించినట్లు తెలిపారు.
బాలీవుడ్ అగ్ర హీరో తన భార్య ప్రొఫెషన్ ..ఆమె వసూలు చేసే భారీ పారితోషికంపై తోటి కళాకారుడితో ఇలాంటి కామెంట్స్ చేయడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని.. స్నేహాన్ని తెలియజేస్తోంది. షారుఖ్ ఖాన్ సరదాగా అన్నప్పటికీ గౌరీ ఖాన్ బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతమైన, ఖరీదైన ఇంటీరియర్ డిజైనర్‌గా పేరుగాంచారు. ఆమె ఇప్పటికే ఎందరో బిగ్ సెలబ్రిటీల ఇళ్లను, కార్పొరేట్ ఆఫీసులను అద్భుతంగా రీడిజైన్ చేశారు. మీకా సింగ్ తన కలల నివాసం కోసం 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడటం, గౌరీ ఖాన్ సృజనాత్మకతపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది.
ఆమె వర్క్ స్టైల్ .. లగ్జరీ టేస్ట్ కారణంగానే ఇండస్ట్రీలో ఆమె డిజైనింగ్‌కు అంతటి క్రేజ్ ఉంది.బాలీవుడ్ పరిశ్రమలో సెలబ్రిటీల మధ్య ఉండే ఇలాంటి బిహైండ్ ది సీన్స్ ముచ్చట్లు అభిమానులను ఎంతగానో అలరిస్తాయి. ఎంత పెద్ద స్టార్లు అయినా? వ్యక్తిగత జీవితంలో ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ సాధారణ స్నేహితుల్లాగే ప్రవర్తిస్తారనే విషయాన్ని ఈ సంఘటన నిరూపిస్తుంది. వ్యాపార లావాదేవీలు, వృత్తిపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ ఇలాంటి హాస్యభరిత సంభాషణలు వారి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన బంధాన్ని ప్రతిబింబిస్తాయి.
