Begin typing your search above and press return to search.

నా వల్లే ఆ స్టార్‌ హీరోకు వేదింపులు తప్పాయి..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్ ఖాన్‌ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఆయన్ను ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన వారు గుర్తిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

By:  Ramesh Palla   |   28 Jan 2026 11:59 AM IST
నా వల్లే ఆ స్టార్‌ హీరోకు వేదింపులు తప్పాయి..!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్ ఖాన్‌ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఆయన్ను ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన వారు గుర్తిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన నటించిన సినిమాల వల్లే కాకుండా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన పాటలు, ఇంకా సోషల్‌ మీడియా పోస్ట్‌ల కారణంగా షారుఖ్‌ ఖాన్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయినా కూడా ఒకానొక సమయంలో ఆయన తన పేరు వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అమెరికా ఒక సినిమా షూటింగ్‌ కోసం వెళ్లిన సమయంలో షారుఖ్‌ ఖాన్‌ ను ఎయిర్‌ పోర్ట్‌లో సెక్యూరిటీ సిబ్బంది ఏకంగా రెండు గంటల పాటు నిర్బంధించారు. అంతే కాకుండా ఆయన పేరు వల్ల ఉగ్రవాది అన్నట్లుగా కూడా అక్కడి సెక్యూరిటీ వారు అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో షారుఖ్‌ ఖాన్‌ ను ఇండియన్‌ ప్రభుత్వం బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

9/11 దాడుల తర్వాత...

తాజాగా ఆ సంఘటన గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా స్పందించారు. చాలా ఏళ్ల నాటి ముచ్చటను ఆయన ఇటీవల ఒక చిట్‌ చాట్‌ సందర్భంగా లేవనెత్తడంతో అందరి దృష్టి ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ విషయమై వైరల్‌ అవుతోంది. అమెరికాలోని విమానాశ్రయంలో షారుఖ్‌ ఖాన్‌ ను ఒక్క సారి మాత్రమే కాదు, పలు సార్లు నిర్బంధించారు. ఆ సమయంలో తాను షారుఖ్‌ ను నిర్భందం నుంచి విడిపించినట్లుగా పేర్కొన్నాడు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత సెక్యూరిటీ వంద రెట్లు పెంచడం జరిగింది. ఆ క్రమంలో ఎయిర్‌ పోర్ట్‌ లో అనుమానం వచ్చిన వారిని ఒకటికి వంద సార్లు చెక్‌ చేయడం, వారి పేరు అనుమానంగా అనిపిస్తే వెంటనే నిర్బంధించడం చేయడం జరిగింది. అలాగే షారుఖ్‌ ఖాన్‌ ను అమెరికన్‌ ఎయిర్ పోర్ట్‌ సెక్యూరిటీ టీం నిర్భందించిన నేపథ్యంలో తాను 15 నిమిషాల్లో అక్కడ నుంచి బయటకు వచ్చేలా చేశాను అని రాజీవ్‌ శుక్లా చెప్పుకొచ్చారు.

షారుఖ్‌ ఖాన్‌ కి అమెరికాలో ఇబ్బంది..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజీవ్‌ శుక్లా మాట్లాడుతూ... 9/11 తర్వాత అమెరికాలో చట్టాలు చాలా కఠినంగా మార్చారు. షారుఖ్ ఖాన్‌ కి సైతం ఎయిర్‌ పోర్ట్‌లో వేదింపులు తప్పలేదు. రెండు గంటలుగా షారుఖ్‌ ఖాన్‌ ను అమెరికా ఎయిర్ పోర్ట్‌ లో నిర్భందించారు అంటూ నాకు ఒక ఫోన్ వచ్చింది. వెంటనే ఒక వ్యక్తితో సంప్రదింపులు జరిపాను. ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఆ వ్యక్తితో సంప్రదింపులు జరిపిన వెంటనే షారుఖ్‌ ఖాన్‌ కు విముక్తి లభించింది. నా వద్దకు సమస్య వచ్చిన 15 నిమిషాల్లోనే షారుఖ్‌ ఖాన్‌ ను, అతడి బ్యాగ్‌ ను వదిలి పెట్టారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది షారుఖ్‌ ఖాన్‌ ను గౌరవంగా అక్కడ నుంచి పంపించారు, అంతే కాకుండా ఆయన బ్యాగేజ్ ను కూడా వెంటనే ఇచ్చారు. షారుఖ్ ఖాన్‌ తో తనకు ఉన్న అనుబంధం అలాంటిది అన్నట్లుగా రాజీవ్‌ శుక్లా అన్నారు.

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా..

షారుఖ్‌ ఖాన్‌ గతంలో పలు సార్లు అమెరికా వెళ్లినా ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. షూటింగ్స్ నిమిత్తం పదుల సార్లు ఆయన అమెరికా వెళ్లినప్పటికీ అప్పుడు ఉన్న సెక్యూరిటీ సిస్టం కారణంగా ఆయన్ను, ఆయన బ్యాగేజ్ ను ఆపేయడం జరిగింది. ఆ కారణంగానే షారుఖ్‌ ఖాన్‌ కు రాజీవ్‌ శుక్లా హెల్ప్‌ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ లేదు. గతంలో ఉన్న హై సెక్యూరిటీ సిస్టమ్‌ అమెరికన్ ఎయిర్‌ పోర్ట్‌లో ఇప్పటికీ ఉంది. అయితే షారుఖ్‌ ఖాన్‌ కి ఉన్న మరింత గుర్తింపు, ఇతర విషయాల కారణంగా ఆయన్ను మళ్లీ ఎప్పుడు ఆపలేదని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. పేరును చూసి అమెరికన్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో చెకింగ్‌ లు ఉంటాయని ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. షారుఖ్‌ అభిమానులు సైతం అమెరికా తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు ఆ సమయంలో చేయడం అందరికీ తెలిసిందే.