2026 ముగింపులో షారుక్ ఖాన్ ఫ్యామిలీ డ్రీమ్ హోమ్ లో!
బాద్‌షా షారుఖ్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ముంబైలోని ల్యాండ్‌మార్క్ బంగ్లా `మన్నత్` గురించి ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
By: Srikanth Kontham | 27 Aug 2026 8:00 AM ISTబాద్‌షా షారుఖ్ ఖాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ముంబైలోని ల్యాండ్‌మార్క్ బంగ్లా `మన్నత్` గురించి ఓ ఆసక్తికరమైన వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న ఐకానిక్ బంగ్లా మన్నత్ కొంతకాలంగా పునరుద్ధరణ పనుల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. షారుక్ కుటుంబ సభ్యులు ఆ ఇంటిని వీడి వేరే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మన్నత్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మన్నత్ బంగ్లా పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
రెండు మూడు నెలల్లో పనులన్నీ పూర్తవుతాయని సమాచారం.అంటే ఈ ఏడాది చివరి నాటికి డిసెంబర్ కల్లా బంగ్లా పూర్తిగా సరికొత్త హంగులతో సిద్ధం కానుంది. దీంతో షారుఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి తిరిగి మన్నత్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మన్నత్ రిపేర్లు కారణంగా షారుక్ కాన్ ,గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్‌లు మన్నత్ నుంచి తాత్కాలికంగా బయటికి వెళ్లారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో వారు బాంద్రాకు సమీపంలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న పూజ కాసా భవనంలో రెండు లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ తాత్కాలిక నివాసంలోనూ కుటుంబమంతా ప్రశాంతంగా గడుపుతున్నారు.
మన్నత్ బంగ్లా విషయానికి వస్తే ఇది గ్రేడ్-3 హెరిటేజ్ ప్రాపర్టీ కావడంతో ప్రధాన బంగ్లా నిర్మాణంలో ఎలాంటి పెద్ద మార్పులు ..అదనపు అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి నిబంధనలు ఒప్పుకోవు. అయినా? బంగ్లా వెనుక భాగంలో ఉన్న `మన్నత్ అనెక్స్` భవనంలో మాత్రం భారీ స్థాయిలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఆరు అస్తులుగా ఉన్న అనెక్స్ భవనానికి అదనంగా మరో రెండు అంతస్తులను చేర్చినట్లు సమాచారం.
అదనపు నిర్మాణంతో అనెక్స్ భవనం విస్తీర్ణం మరింత పెరిగి 30000 చదరపు అడుగులకు పైగా విశాలమైన వాతా వరణం ఏర్పడింది. పాత ఆరు అంతస్తులతో పాటు కొత్తగా నిర్మించిన భాగంలోనూ అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. షారుఖ్ ఖాన్ కుటుంబ అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్ డిజైనింగ్ పనులను గౌరీ ఖాన్ స్వయంగా చూసుకుంటున్నారు. వాటన్నింటిని పూర్తి చేసి డిసెంబర్ కల్లా మన్నాత్ లోకి దిగిపోవాలని కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే రీ ఎంట్రీకి సంబంధించి సెలబ్రిటీలందరిని ఆహ్వానించి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా కానిచ్చేస్తారా? అన్నది తెలియాలి. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్లో పెద్దగా హడావుడి చేయరు. కానీ మన్నత్ షారుక్ కలల నివాసం కాబట్టి ఛాన్స్ తీసుకుంటారేమో చూడాలి.
