సంపదల్లో వరల్డ్ నం.1 ఈ భారతీయ నటుడు
కింగ్ ఖాన్ సంపదలు స్థిరంగా పెరుగుతున్నాయని హురూన్ రిపోర్ట్ నిరూపిస్తోంది. మరోవైపు వెటరన్ నటి, వ్యాపారవేత్త జూహి చావ్లా, ఆమె కుటుంబ సంపదలు 7,790 కోట్ల నికర విలువతో తర్వాత స్థానంలో ఉండగా, హృతిక్ రోషన్ రూ. 2,160 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
By: Sivaji Kontham | 1 Oct 2025 5:53 PM ISTకింగ్ ఖాన్ షారుఖ్ రూ. 12,490 కోట్ల నికర సంపదలతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుడిగా రికార్డులకెక్కారు. అక్టోబర్ 1న విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 వెల్లడించిన వివరాల ప్రకారం... బాలీవుడ్ సూపర్‌స్టార్ బిలియనీర్ క్లబ్ లో చేరారు. షారూఖ్ 33 ఏళ్ల సినీకెరీర్ లో అద్భుతమైన ఆర్థిక మైలురాయిని అందుకున్నారని హురూన్ ప్రకటించింది.
హురూన్ ప్రకారం.. అంతర్జాతీయ వేదికపై షారుఖ్ ఎదుగుదల అజేయంగా కొనసాగుతోంది. బాద్ షా రూ. 12,490 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు) సంపదతో మొదటిసారిగా బిలియనీర్ క్లబ్‌లో చేరారు. షారూఖ్ పలువురు హాలీవుడ్ స్టార్లను సైతం వెనక్కి నెట్టాడు. టేలర్ స్విఫ్ట్ ($1.3 బిలియన్), ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ($1.2 బిలియన్), జెర్రీ సీన్‌ఫెల్డ్ ($1.2 బిలియన్), సెలీనా గోమెజ్ ($720 మిలియన్) సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖుల సంపదను షారూఖ్ సంపద మించిపోయింది.
కింగ్ ఖాన్ సంపదలు స్థిరంగా పెరుగుతున్నాయని హురూన్ రిపోర్ట్ నిరూపిస్తోంది. మరోవైపు వెటరన్ నటి, వ్యాపారవేత్త జూహి చావ్లా, ఆమె కుటుంబ సంపదలు 7,790 కోట్ల నికర విలువతో తర్వాత స్థానంలో ఉండగా, హృతిక్ రోషన్ రూ. 2,160 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
కింగ్ ఖాన్ ఆస్తులు అనూహ్యంగా ఒక ఏడాదిలోనే భారీగా పెరిగాయి. గత సంవత్సరం 870 మిలియన్ డాలర్ల నికర ఆస్తులతో అతడు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు 870 మిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్ల రేంజుకు అతడి సంపదలు ఎదిగాయి అంటే, సినిమాల ద్వారా ఆదాయం సహా అతడి ఇతర వ్యాపార సంస్థల అభివృద్ధి అన్ స్టాపబుల్ గా కొనసాగుతందని అర్థం చేసుకోవచ్చు.
ఖాన్ కేవలం పారితోషికాల రూపంలోనే కాదు.. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్, VFX స్టూడియో, పలు క్రికెట్ టీమ్‌లపై పెట్టుబడులు, విదేశాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. ఇవన్నీ అంతకంతకు ఘనమైన వృద్ధిరేటను నమోదు చేస్తున్నాయి. ఖాన్ తదుపరి కింగ్ అనే చిత్రంలో సుహానా ఖాన్ తో కలిసి నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా పూర్తవుతోందని సమాచారం. షారూక్ తన మూడు దశాబ్ధాల కెరీర్ లో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. జవాన్ లో నటనకు గాను ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.
