Begin typing your search above and press return to search.

డార్లింగ్ ని చూసి కింగ్ భ‌య‌ప‌డుతున్నాడా?

పాన్ ఇండియాలో ఒకేసారి ఇద్ద‌రు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయిన స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   29 Jan 2026 5:00 AM IST
డార్లింగ్ ని చూసి కింగ్ భ‌య‌ప‌డుతున్నాడా?
X

పాన్ ఇండియాలో ఒకేసారి ఇద్ద‌రు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయిన స‌న్నివేశం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా? నేనా? అన్న‌ట్లు త‌ప‌ల‌డాల్సి ఉంటుంది. ఏ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తే ఆ సినిమాదే అప్ప‌ర్ హ్యాండ్. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా సినిమా స‌క్స‌స్ పుల్ చిత్రం ముందు నిలబడ‌టం క‌ష్టం. ఇలాంటి స‌న్నివేశాన్ని షారుక్ ఖాన్ ఓసారి చూసారు. ఓ ఏడాది షారుక్ ఖాన్ న‌టించిన `డంకీ`, ప్ర‌భాస్ న‌టించిన `స‌లార్` చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అప్ప‌టికే షారుక్ ఖాన్ `ప‌ఠాన్`, `జ‌వాన్` విజ‌యాల‌తో మంచి ఫాంలో ఉన్నాడు.

ఆ రెండు సినిమాలు 2000 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించాయి. దీంతో రెట్టించిన న‌మ్మ‌కంతో `డంకీ` చిత్రాన్ని 2023 డిసెంబ‌ర్ 21 న రిలీజ్ చేసాడు. ఆ మ‌రుస‌టి రోజేనే ప్ర‌భాస్ న‌టించిన `స‌లార్ సీజ్ ఫైర్` రిలీజ్ అయింది. అప్ప‌టికే రెండు సినిమాల మ‌ధ్య ట‌ప్ ఫైట్ త‌ప్ప‌ద‌ని నెట్టింట మీడియా క‌థ‌నాలు వెడెక్కించాయి. కానీ నిరిలీజ్ అనంత‌రం ప్ర‌భాస్ వేగాన్ని షారుక్ ఖాన్ త‌ట్టుకోలేక‌పోయాడు. `డంకీ` యావ‌రేజ్ టాక్ రాగా, `సలార్` బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ రావ‌డంతో తేలిపోయింది. `డంకీ` 400 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించ‌గా స‌లార్ 800 కోట్ల వ‌సూళ్ల‌తో టాప్ లో నిలిచింది.

అదే `స‌లార్` రిలీజ్ లేని స‌మ‌యంలో `డంకీ` రిలీజ్ అయి ఉంటే మంచి వ‌సూళ్ల‌ను సాధించేద‌ని ట్రేడ్ పండిత‌లు అంచ‌నా వేసారు. నార్త్ మార్కెట్ లోనే `డంకీ`పై ఆ ర‌కంగా పంచ్ ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా 2027లోనూ ప్ర‌భాస్-షారుక్ ఖాన్ త‌ల‌ప‌డే స‌న్నివేశం ఎదురైంది. ప్ర‌భాస్ న‌టిస్తోన్న `స్పిరిట్` మార్చిలో రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో షారుక్ ఖాన్ న‌టిస్తోన్న `కింగ్` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ గ‌త అనుభ‌వం దృష్ణ్యా కింగ్ చిత్రాన్ని ప్రీ పోన్ చేస్తున్నారు.

ప్ర‌భాస్ తో పోటీ ప‌డ‌టం కంటే ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో క్రిస్మ‌స్ కు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. హాలీవుడ్ మూవీ `అవెంజర్స్ తో పోటీ పడటానికైనా షారుఖ్ సిద్ధపడ్డారు కానీ, ప్రభాస్ - సందీప్ వంగా మాస్ సునామీకి అడ్డంగా నిలబడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరి క్రిస్మస్ రేసులో షారుఖ్ గెలుస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి. అయితే డిసెంబ‌ర్ నెల మాత్రం షారుక్ ఖాన్ కి బాగా క‌లిసొచ్చిన మాసం. స‌క్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తాడ‌ని అభిమానులు న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇదే సినిమాతో షారుక్ ఖాన్ త‌న‌య సుహాన్ ఖాన్ కూడా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.