Begin typing your search above and press return to search.

కింగ్ టీజ‌ర్: ఏజ్‌లెస్‌ డాన్ చాలా కొత్త‌గా ఉన్నాడే

షారుఖ్ ఖాన్ ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో చూపించేందుకు సిద్ధార్థ్ ఆనంద్ చాలా క‌స‌ర‌త్తు చేసార‌ని ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

By:  Sivaji Kontham   |   2 Nov 2025 2:43 PM IST
కింగ్ టీజ‌ర్: ఏజ్‌లెస్‌ డాన్ చాలా కొత్త‌గా ఉన్నాడే
X

నెరిసిన జుత్తు గ‌డ్డం.. చెవికి ఎర్ర‌ని పీర్సింగ్ రింగు.. నుదుటిపైకి ప‌డిన ముంగురులు.. చురుకైన చూపులు.. ఓవ‌రాల్ గా ఈ వేషం చూస్తుంటే కింగ్ ఖాన్ ఈసారి చాలా ఏదో కొత్త‌ద‌నం ట్రై చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. తన వ‌య‌సును దాచ‌కుండానే, యువ‌కుడిలా క‌నిపిస్తున్నాడు. ఈ యువ‌కుడికి 45 అంటే న‌మ్మేసేలా అత‌డి వేష‌ధార‌ణ‌ను తీర్చిదిద్దిన వైనం ఆక‌ట్టుకుంటోంది.

కింగ్ మూవీ కోసం షారూఖ్ ని సిద్ధార్థ్ ఆనంద్ ఎంత‌గా ప్రిపేర్ చేసాడో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుద‌లైన తాజా టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. `కింగ్` ఒక రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ సినిమా. మాఫియా నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించ‌నుంది. షారుఖ్ ఖాన్ ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతారంలో చూపించేందుకు సిద్ధార్థ్ ఆనంద్ చాలా క‌స‌ర‌త్తు చేసార‌ని ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

టీజ‌ర్ లో డైలాగ్ ఫ్యాన్స్ లో గుబులు పుట్టిస్తోంది. ``నేను ఎంత మందిని చంపానో నాకు గుర్తులేదు.. వాళ్ళు మంచివారా చెడ్డవారా అని నేను ఎప్పుడూ అడగలేదు. నాకు గుర్తున్నదల్లా వాళ్ళ కళ్ళలో భయం.. ఇదే వాళ్ళ చివరి శ్వాస.. దానికి నేనే కారణం. వెయ్యి హత్యలు.. దానికోసం వంద దేశాలకు వెళ్లాలని ఉంది. ప్రపంచం నాకు ఒక పేరు పెట్టింది`` అంటూ ఖాన్ వాయిస్ ఓవ‌ర్ భ‌య‌పెడుతోంది. అయితే ఇంత‌టి క్రూరుడికి కింగ్ అనే పేరు ఎందుకు వ‌చ్చిందో తెలీదు. అత‌డు అంత‌గా మ‌నుషుల‌ను చంపాల్సిన అవ‌స‌రం ఏం ఉందో.. మాఫియా సామ్రాజ్యంలో అత‌డు కింగ్ అని భావించాలా.. ఇలాంటి సందేహాల‌న్నిటికీ సినిమా చూసాకే ఒక జ‌వాబు చెప్ప‌గ‌లం. ముఖ్యంగా ఇందులో యాక్ష‌న్ పార్ట్ చూస్తుంటే, క‌చ్ఛితంగా ఇది కూడా ఒక సౌత్ సినిమా నుంచి ప్రేర‌ణ పొందిన‌ది అని ఊహించ‌గ‌లం.

ప్ర‌స్తుతానికి లోకానికి ఒక స‌రికొత్త కింగ్ ని ఆవిష్క‌రించాడు సిద్ధార్థ్. అత‌డిని స‌రికొత్త వేష‌ధార‌ణ‌లో చూపిస్తున్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ మరో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. దీపికా పదుకొనే, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లవత్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ, రాఘవ్ జుయల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 2026లో కింగ్ విడుదలవుతుంది.