షారుఖ్‌కు హాలీవుడ్ దెబ్బ.. కింగ్‌కు ఓ టెన్షన్!
డిసెంబర్ 24న విడుదల కానున్న షారుఖ్ ఖాన్ ‘కింగ్’కు అమెరికాలో థియేటర్ల కొరత ఎదురయ్యే అవకాశముంది. ఆరు రోజుల ముందే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’, ‘డ్యూన్ 3’ విడుదలవుతుండటంతో ప్రీమియం స్క్రీన్ల కోసం పోటీ పెరగనుంది. ‘కింగ్’కు 4–5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ రావొచ్చనే అంచనాలున్నా, అడ్వాన్స్ బుకింగ్స్‌తో స్పష్టత రానుంది.
By: M Prashanth | 24 Nov 2026 2:02 PM ISTఓవర్సీస్ మార్కెట్‌లో షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పఠాన్, జవాన్ సినిమాలతో విదేశాల్లో భారీ వసూళ్లు అందుకున్నారు. ఇప్పుడు కింగ్‌తో మరోసారి అదే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఈసారి క్రిస్మస్ సీజన్ అంత ఈజీగా కనిపించడం లేదు. షారుఖ్ సినిమాకు మంచి డిమాండ్ ఉన్నా, థియేటర్ల విషయంలో మాత్రం గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్‌లో పరిస్థితి కాస్త డిఫరెంట్‌గా ఉండబోతోంది.
డిసెంబర్ 24న కింగ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ అంతకంటే ఆరు రోజుల ముందే అవెంజర్స్ డూమ్స్‌డే, డ్యూన్ పార్ట్ 3 థియేటర్లలోకి వస్తున్నాయి. హాలీవుడ్‌లో ఈ రెండు ఫ్రాంచైజీలకు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా పెద్ద స్క్రీన్లు, ఐమ్యాక్స్ షోల కోసం కూడా డిమాండ్ ఉంటుంది. దీంతో కింగ్ రిలీజ్ సమయానికి కొన్ని ప్రీమియం స్క్రీన్లు అప్పటికే హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండే అవకాశం ఉంది.
షారుఖ్‌కు అమెరికాతో పాటు యూకే, గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా మొదటి రోజు ప్రీమియర్ల నుంచే పెద్ద మొత్తంలో వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎక్కువ షోలు దొరికితేనే ఆ డిమాండ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అవెంజర్స్, డ్యూన్ రెండో వారంలోనూ మంచి ఆక్యుపెన్సీ సాధిస్తే డిస్ట్రిబ్యూటర్లు వాటికి షోలు కొనసాగించే అవకాశం ఉంటుంది. కింగ్‌కు మొదటి వీకెండ్‌లో ఎన్ని స్క్రీన్లు దక్కుతాయనేది చూడాలి.
ఇక 2026 ఓవర్సీస్ ఓపెనింగ్స్ చూస్తే రజనీకాంత్ జైలర్ 2 ముందుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం ప్రీమియర్లు, మొదటి రోజు కలిపి 6.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ధురంధర్ 2 సుమారు 5.55 మిలియన్లు, రామాయణం 5.45 మిలియన్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కింగ్‌కు ప్రస్తుతం 4 నుంచి 5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ రావొచ్చని కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఈ అంచనాల్లో మార్పులు రావచ్చు.
మరోవైపు కింగ్ రిలీజ్ డేట్ మార్చే ఆలోచన లేదని షారుఖ్ ఇప్పటికే చెప్పారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పఠాన్ తర్వాత షారుఖ్, సిద్ధార్థ్ ఆనంద్ మళ్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈసారి హాలీవుడ్ సినిమాలు ముందే రావడం వల్ల రిలీజ్ ప్లానింగ్‌లో మరింత జాగ్రత్త అవసరం.
క్రిస్మస్ తర్వాతి రోజు జుమాంజీ ఓపెన్ వరల్డ్ కూడా విడుదల కానుంది. దీంతో హాలీవుడ్ సినిమాల పోటీ మరింత పెరుగుతుంది. కింగ్ మాత్రం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను టార్గెట్ చేస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డీల్ కూడా జరిగినట్లు రిపోర్టులు వచ్చాయి. ఇక డిసెంబర్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
